సంగీత్ వేడుకకు చాహల్ రాగానే హరిణ్య ఎమోషనల్… రాహుల్ ఇచ్చిన

ఆస్కార్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ తన కాబోయే భార్య హరిణ్య రెడ్డికి సంగీత్ వేడుకలో ప్రత్యేక సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె అభిమాన క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను వేడుకకు ఆహ్వానిస్తూ రాహుల్ ఆమెను షాక్ చేశారు. ఈ ప్రత్యేక క్షణాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

flnfln
Nov 25, 2025 - 11:44
Nov 25, 2025 - 11:53
 0  3
సంగీత్ వేడుకకు చాహల్ రాగానే హరిణ్య ఎమోషనల్… రాహుల్ ఇచ్చిన

Main points : 

* భార‌త‌ స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను సంగీత్ వేడుకలకు ఆహ్వానం. 

* ఇష్టమైన క్రికెటర్‌ను చూసి షాక్  అయినా హరిణ్య రెడ్డి

* రాహుల్, హరిణ్య, చాహల్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

* 27న ఘనంగా జరిగిన వివాహ వేడుక సంబరాలు. 

 Fourth line news : RRR సినిమా తర్వాత ప్రజల్లో  మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ సింగర్, ఆస్కార్ విన్నర్ అయినా రాహుల్ సిప్లిగంజ్ తన వివాహ వేడుకలలో కాబోయే భార్య కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. హరిణ్య రెడ్డి కి టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు అంటే చాలా ఇష్టం, ఆయనకు పెద్ద అభిమాని కూడా. దాంతో వివాహ వేడుకకి యుజ్వేంద్ర చాహల్‌కు ఆహ్వానించి ఆమెకి సర్ప్రైజ్ ఇచ్చారు. తన ఫేవరెట్ క్రికెటర్‌ను చూసిన ఆమెకు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందమైన క్షణాలను ఫోటోలతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలన్నీ చాలా వైరల్ గా మారుతున్నాయి.  

ఈ నెల 27న జరగనున్న రాహుల్–హరిణ్యల వివాహాన్ని ముందుగానే వేడుకల వాతావరణం అలుముకుంది. ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్స్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. వాటిలో భాగంగా జరిగిన సంగీత్ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది.

సంగీత్‌కు ప్రత్యేక అతిథిగా టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ హాజరయ్యారు. అతిథిగా వచ్చిన చాహల్‌కు రాహుల్ ప్రత్యేక కానుక ఇస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భాన్ని హరిణ్య ఎంతో భావోద్వేగంతో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ,

“నా జీవితంలో ఇంత విలువైన గిఫ్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్యూ రాహుల్! మా సంగీత్‌కు వచ్చి వేడుకను మరింత అందంగా చేసిన చాహల్ గారికి స్పెషల్ థ్యాంక్స్” అని పేర్కొన్నారు.

హరిణ్య చాహల్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు రాహుల్ ఆప్యాయతను, హరిణ్య ఆనందాన్ని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

అలాగే, ఈ వివాహం నవంబర్ 27న ఉదయం 5 గంటలకు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ లగ్జరీ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరగబోతోంది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారని సమాచారం.

రాహుల్, హరిణ్య వ్యక్తిగతంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెళ్లి ఆహ్వానించగా, ఆయన హాజరవుతారని కూడా ప్రచారం. హరిణ్య, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె కావడంతో ఈ వివాహం రాష్ట్రంలోనే పెద్ద రాజకీయ–సామాజిక వేడుకగా మారింది.

నిశ్చితార్థ వేడుకలో రాహుల్ ఆమెకు ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్ గిఫ్ట్‌గా ఇచ్చి అప్పుడే వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు సంగీత్ వేడుకలో చాహల్ హాజరుతో వారి వివాహ వేడుకలు మరింత స్టార్డమ్ అందుకున్నాయి.

* రాహుల్ తన భార్యకు ఇచ్చిన గిఫ్ట్ ఎలా అనిపించింది 

* మరి మీకు ఇష్టమైన క్రికెటర్‌ను ఎవరు, 

* ఆయనని మీరు ఎప్పుడైనా కలిసారా ? 

* మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 

* రాహుల్, హరిణ్య ,యుజ్వేంద్ర చాహల్‌ దిగిన ఫోటోలు కింద ఉన్నాయి ఒక్కసారి చూడండి. 

* fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.