వరల్డ్ కప్ గెలిచిన భారత సూపర్ క్వీన్స్‌కు రేపు ప్రధాని మోదీ ఆతిథ్యం
ICC మహిళా వరల్డ్ కప్–2025 గెలిచిన భారత జట్టుకు రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఢిల్లీకి ఈ సాయంత్రం హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టు చేరుకోనుంది.
ICC మహిళా వరల్డ్ కప్–2025ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియాకు రేపు (నవంబర్ 5న) ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఆహ్వానాన్ని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఇప్పటికే బీసీసీఐకి పంపింది.
ఈరోజు సాయంత్రం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళా క్రికెటర్లు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో భారత మహిళా జట్టు సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి, దేశానికి చారిత్రాత్మక వరల్డ్ కప్‌ను అందించింది. ఈ విజయంతో భారత క్రికెట్ చరిత్రలో మరో గర్వకారణమైన అధ్యాయం రాయబడింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0