సొంత కారు అమ్మిన డైరెక్టర్ సుజిత్… అదే మోడల్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన పవన్ కళ్యాణ్

OG సినిమా కోసం తన సొంత కారు అమ్మిన డైరెక్టర్ సుజిత్‌కు అదే మోడల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన పవన్ కళ్యాణ్. ఈ భావోద్వేగ కథను Fourth Line News‌లో చదవండి.

flnfln
Dec 18, 2025 - 21:08
 0  3
సొంత కారు అమ్మిన డైరెక్టర్ సుజిత్… అదే మోడల్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన పవన్ కళ్యాణ్

* OG సినిమా కోసం సొంత కారుని అమ్మివేసిన సుజిత్ 
* జపాన్ లో కొన్ని సన్నివేశాలు చేయాలనుకున్నారు కానీ 
* నిర్మాత దానికి ఒప్పుకోలేదు అయితే సుజిత్ 
* ఓ జి సినిమా మెగా అభిమానులను పవన్ కళ్యాణ్ అభిమానులను 
* పవన్ కళ్యాణ్ అదే మోడల్ ను గిఫ్ట్ గా ఇచ్చారు 
* అసలు పూర్తి వివరాల్లోనికి వెళ్తే : 

 fourth line news కథనం : OG  డైరెక్టర్ సుజిత్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక  గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏమిటి అని అనుకుంటున్నారా? ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఎందుకు పవన్ కళ్యాణ్ సార్ ఆ కార్ గిఫ్ట్ గా ఇచ్చారు అంటే. దీని వెనకాల ఒక పెద్ద కథ ఉంది. పూర్తి వివరాలు లోనికి వెళ్తే. 


సుజిత్ దర్శకత్వంలో తర్కెక్కిన సినిమా OG అందులో హీరోగా నటించిన పవన్ కళ్యాణ్. ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలుసు. ప్రాముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు, మెగాస్టార్ అభిమానులకు ఆ సినిమా ఒక ప్రత్యేక ఒక అనుభవం అని చెప్పవచ్చు, అలాంటి సినిమా తీసిన డైరెక్టర్ సుజిత్ తన సొంత కారుని అమ్ముకోవాల్సి వచ్చింది. ఎందుకు ఆ కారును అమ్ముకోవాల్సి వచ్చింది అంటే : OG సినిమాలోని కొన్ని సీన్స్ జపాన్లో షూట్ చేద్దామనుకుంటే బడ్జెట్ వల్ల నిర్మాత ఒప్పుకోలేదు. కానీ ఆ సీన్స్ ఆదేశంలోనే తీస్తే బాగుంటుంది అని సుజిత్ తన సొంత కారుని అమ్మేసి షూటింగ్ పూర్తి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అదే మోడల్ కార్ను గిఫ్ట్ గా ఇచ్చారు. 


డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ OG చిత్రం ఎంతగానో హిట్ అయింది. అభిమానులని మెగా అభిమానులను ఎంతో ఆదరించిన సినిమా అది. మరి ఆ సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ తన సొంత కారుని అమ్మి కొన్ని సన్నివేశాలను తీశాడు అంటే ప్రతి సన్నివేశాన్ని  చాలా జాగ్రత్తగా తీస్తేనే సినిమా అనేది బాగా వచ్చింది కాబట్టి డబ్బులు లేకపోయినా కూడా, నిర్మాత ఒప్పుకోకపోయినా, డైరెక్టర్ అనుకున్నది పలాన ప్లేసులో తీయాలి అని ఫిక్స్ అయితే ఏదైనా  చేయగలడు అనేది  సుజిత్ చూసి మనం నేర్చుకోవచ్చు. కారు అమ్మి వేసి షూటింగ్ పూర్తి చేశారు సుజిత్. కానీ పవన్ కళ్యాణ్ గారు అదే మోడల్ లో ఉన్న కారుణ్య గిఫ్ట్ ఇచ్చారు.  ఇప్పుడు ఈ గిఫ్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓజే సినిమా డైరెక్టర్కు గిఫ్ట్ ఇవ్వటం మీకు ఎలా అనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. 

ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా ప్రతి సినిమా అప్డేట్ మీరు చదవచ్చు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.