నాగ్పూర్లో చిరుత కలకలం… జనావాసంలో దాడి, ఏడుగురికి గాయాలు
నాగ్పూర్లో జనావాసంలోకి వచ్చిన చిరుత దాడి చేసి ఏడుగురిని గాయపర్చింది. అటవీ శాఖ రెస్క్యూ బృందాలు వెంటనే స్పందించి చిరుతను బంధించాయి. సంఘటనపై ఫారెస్ట్ మినిస్టర్ గణేశ్ నాయక్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
* మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలో చిరుత
* చిరుత వల్ల ఏడుగురికి గాయాలు
* ఆహారం కోసమే చిరుత జనాల మధ్యలో వచ్చిందని అధికారి వెల్లడి.
* అడవిలోకి భారీగా మేకలను విడిచి పెట్టాలి అని ఆదేశాలు
* ఎవరు ప్రాణాలు పోకపోవడంతో ప్రజలు ఓబులు పిలుచుకున్నారు.
fourth line news : మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలో చిరుత ఒకటి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. తెల్లవారుఝామునే అది పర్యాటకులు, స్థానికులు తిరిగే ప్రాంతంలోకి ప్రవేశించి అక్కడున్న జనాలపై దాడికి యత్నించింది. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ బృందం సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. ఫారెస్ట్ ఆఫీసర్ రాజేష్ జాధవ్ తెలిపారు ఆకలితో ఆహారం కోసం వెతుకుతూ చిరుత పొరపాటున జనావాసాల్లోకి వెళ్లి ఉండవచ్చని సూచించారు.
ఇక ఈ తరహా సంఘటనలు పదేపదే జరుగకుండా ఉండేందుకు అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మేకలను వదిలి పెట్టి వన్యప్రాణులకు సహజ ఆహారాన్ని అందుబాటులో ఉంచాలని ఫారెస్ట్ మినిస్టర్ గణేశ్ నాయక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వార్త పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0