మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్ గారు’కి రికార్డ్ స్టార్ట్… తొలి టికెట్ ధర వింటే షాక్!

ఫోర్త్ లైన్ న్యూస్ కథనం | భారత్ కుమార్ : మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు సంక్రాంతి కానుకగా రాబోతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఇప్పటికే అభిమానుల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

Jan 7, 2026 - 11:26
 0  4
మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్ గారు’కి రికార్డ్ స్టార్ట్… తొలి టికెట్ ధర వింటే షాక్!

1. మన శంకర వరప్రసాద్ గారు. యుద్ధానికి రెడీ 

2. అనిల్ రావుపూడి దర్శకత్వంలో 

3. అభిమాని మొదటి టికెట్ ఎంతకి దక్కించుకున్నాడు తెలుసా? 

4. ఈరోజే ఫ్రీ రిలీజ్ ఈవెంట్.

 fourth line news : మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ' మన శంకరవరప్రసాద్ గారు. ' కానుకగా ఫ్రెష్ శకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఈనెల జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం. మనందరికీ తెలిసిన దర్శకుడు అపజయాలు లేని వీరుడు రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి; నయనతార కథానాయకులుగా రిక్షాకలు ముందుకు రాబోతున్నారు. సినిమా ఇంకొన్ని రోజుల్లో విడుదలబోతుండగా ఇప్పటినుంచే ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. చాలా చోట్ల టికెట్లు చెర వేగంగా అమ్ముడుపోతున్నాయి. 

అయితే కోనసీమ జిల్లా అమలాపురం లోని వెంకటరమణ థియేటర్లో జరిగిన ఒక ప్రత్యేకమైన ఈవెంట్లో చిరంజీవి యువ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ప్రీమియం షో మొదటి టికెట్ కోసం వేలం నిర్వహించగా, ఈ వేళములో మెగా అభిమాని, జిల్లా బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి వెంకట్ సుబ్బారావు పాల్గొని ప్రీమియర్ షో మొదటి టికెట్ను ఏకంగా 1.11 లక్షల రూపాయలకు దక్కించుకున్నాడు. వచ్చిన ఎమౌంట్ అంతటిని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు అందజేశామని అభిమానుల సంఘం నాయకులు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మొదటి టికెట్ కొనుగోలు చేయడంపై అభిమాని సుబ్బారావు సంతోషం వ్యక్తం చేశారు. 

ఇప్పటికే సినిమాలో కొన్ని సన్నివేశాలు వైరల్ గా మారడం జరిగింది. చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబినేషన్ కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు అభిమానుల్లో, సినీ వర్గాలలో నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన ప్రోమోలు, పాటలు, ఫోటోలు ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి మనందరికి తెలిసిందే. సినిమాపై ఊహాగానాలు రోజురోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఇక సినిమాకి సెన్నార్ నుంచి యు / ఏ సర్టిఫికెట్ దక్కింది. ఈ సినిమా మొత్తం 2 గంటల 42 నిమిషాలు ఉండబోతుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక సాంగ్లో ఇప్పటికే కనిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. 

సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈరోజు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగడంతో మెగా అభిమానులు ఇప్పటికే ఉత్సాహంగా ఉన్నారు. సినిమా విడుదల అయినంక ఎంత కలెక్షన్ చేసిందో వేచి చూడాల్సి ఉంది. 

మరి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది! అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా భారీగా విజయాన్ని అనుకుంటుందా! చిరంజీవి గారి నటన ఏవిధంగా ఉండబోతుంది? మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0