మహిళలకు వడ్డీ లేకుండా భారీ రుణాలు – ప్రభుత్వ లక్ష్యం లక్ష కోట్లు: భట్టి విక్రమార్క
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు వడ్డీలేని రుణాలుగా 5 ఏళ్లలో ₹1 లక్ష కోట్లు అందించడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటి వరకు ₹27 వేల కోట్లు జారీ చేసినట్లు చెప్పారు.
1. మహిళల కోసం వడ్డీరహిత రుణాలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది.
2. ఇప్పటి వరకు ₹27 వేల కోట్ల వడ్డీలేని రుణాలు మహిళా సంఘాలకు జారీ చేశారు.
3. రాబోయే 5 ఏళ్లలో మొత్తం ₹1 లక్ష కోట్లు రుణాలివ్వడం ప్రభుత్వ లక్ష్యం.
4. రాష్ట్రంలోని మహిళలకు నాణ్యమైన చీరల పంపిణీ కొనసాగుతోంది.
5. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పథకాలు పేదలకు సహాయపడుతున్నాయి.
fourth line news : తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించే దిశగా కీలక చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు అందించే పథకాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు ₹27 వేల కోట్ల వడ్డీరహిత రుణాలు మహిళా సంఘాలకు అందించామని, రాబోయే ఐదేళ్లలో ₹1 లక్ష కోట్లు ఇవ్వడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న 1.15 కోట్ల కుటుంబాలలో లక్షకు పైగా మహిళలకు నాణ్యమైన చీరలను ప్రభుత్వం అందిస్తున్నట్లు భట్టి పేర్కొన్నారు. మహిళలు, పేద కుటుంబాలు స్వయం సమృద్ధి సాధించేందుకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలు గొప్పగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
* కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ యొక్క పథకాలు పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి
* కచ్చితంగా ఈ యొక్క పథకాలను అందరూ అందుకోవాలని మేము కోరుకుంటున్నాము.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0