డైరెక్టర్ నుంచి హీరోగా మారిన లోకేశ్ కనగరాజ్.. తొలి మూవీకే ₹30 కోట్లు!
స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా మారి ‘DC’ చిత్రంతో నటుడిగా కొత్త అడుగు వేశారు. తొలి సినిమాకే ₹30 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సినీ వర్గాల టాక్.
కోలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో స్టార్ డైరెక్టరుగా ఎదిగిన లోకేశ్, ఇప్పుడు నటుడిగా తన కొత్త ప్రయాణం మొదలుపెట్టారు.
తాజాగా ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘DC’ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. దర్శకుడిగా సుమారు ₹50 కోట్లు వరకు పారితోషికం తీసుకున్న లోకేశ్, హీరోగా తన తొలి మూవీకే ₹30 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
తొలి సినిమా నుంచే ఇంత భారీ పారితోషికం తీసుకోవడం కోలీవుడ్‌లో రికార్డ్‌గా భావిస్తున్నారు. అభిమానులు ఇప్పుడు ఆయన నటన ఎలా ఉంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0