పోలీస్ ఇంట్లోనే పీహెచ్‌డీ దొంగలు: ఆ 37 తులాల బంగారం ఏమైంది?

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో సంచలనం. మహిళా కానిస్టేబుల్ పూజిత ఇంట్లో చొరబడిన దొంగలు 37.7 తులాల బంగారం దోచుకెళ్లారు. ఫోర్త్ లైన్ న్యూస్ ప్రత్యేక కథనం.

Jan 3, 2026 - 07:35
 0  3
పోలీస్ ఇంట్లోనే పీహెచ్‌డీ దొంగలు: ఆ 37 తులాల బంగారం ఏమైంది?

* దొంగతనం చేయడంలో పిహెచ్డి చేశారేమో. 

* కానిస్టేబుల్ ఇంట్లో దొంగలు 

* ఈ వార్త ఎక్కడ జరిగిందో తెలుసా?

 ఖమ్మం ఫోర్త్ లైన్ న్యూస్ కథనం :ఖమ్మం జిల్లాలో ఎవరు ఊహించని ఒక దొంగతనం జరిగిందని. ఎక్కడైనా పోలీసులు దొంగలు పట్టుకుంటారు. కానీ ఇక్కడ దొంగ ఏకంగా పోలీస్ ఇంట్లో 37 తులాల బంగారాన్ని దొంగతనం చేశాడు. ఏ దొంగతనం ఎక్కడ జరిగింది అంటే ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో కోయచలకలొ మహిళా కానిస్టేబుల్ పూజిత ఇంట్లో జరిగినట్టు తెలుస్తుంది. 

దంపతులు ఇద్దరు విధులకు వెళ్లిన సమయంలో ఇంటి తాళం దొంగలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 37.7 తులాల బంగారం, నగదు దోచుకెళ్ళారు కేటుగాళ్లు. బాధితురాలి ఫిర్యాదుతో సీఐ ఉస్మాన్ ఫరీఫ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అంచిన ప్రకారం పాత నేరస్తుల పనేనని అనుమానిస్తున్నారు. పోలీస్ ఇంటిలోనే దొంగతనం జరగటం కొంత స్థానికంగా కలకలం రేపింది. 

ఈ మధ్యలో దొంగలు పేద, మధ్య కుటుంబాలలో దొంగలించడం పూర్తిగా మానివేసి. ధనికుల ఇంట్లోనూ, అధికారుల ఇంట్లోనూ. ముఖ్యంగా పోలీస్ ఇంటిలోనూ దొంగతనం చేస్తూ ఉన్నారు. దొంగలు ఏ విధంగా ముదిరిపోయారు అంటే ఈ వార్తను బట్టి మనము అర్థమవుతుంది. అందుకే పోలీసులు ప్రజలందరికీ హెచ్చరిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి దొంగలు ఎప్పుడైనా మీ వస్తువులను దొంగలెల్లచు అని. ఏ మాటకే ఆ మాటే గాని దొంగలు ఏకంగా కానిస్టేబుల్ ఇంట్లోనే దొంగతనం చేశారు అంటే వాళ్ళకి తెలిసే చేశారా తెలియచేశారు అనేది వాళ్ళని పట్టుకున్నాక తెలిసిద్ది. మరి వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0