ఐసీసీ లేటెస్ట్ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ముగ్గురు భారతీయులు........?

ఐసీసీ మహిళల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్ సత్తా చాటింది. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ టాప్-10లో నిలిచారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Dec 30, 2025 - 16:24
Dec 30, 2025 - 16:27
 0  5
ఐసీసీ లేటెస్ట్ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ముగ్గురు భారతీయులు........?

ICC ర్యాంకింగ్స్: టాప్-10లో ముగ్గురు ఇండియన్స్

1. టాప్ టెన్ లో ముగ్గురు ఇండియన్స్ అంట. 
2. భారతీయ టీమ్ ఉమెన్స్ సూపర్ ఫామ్. 
3. షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా
4. ముగ్గురు ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారు. 

ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల T20I బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మరోసారి తమ సత్తా చాటారు. ముఖ్యంగా యువ ఓపెనర్ షెఫాలీ వర్మ అద్భుత ప్రదర్శనతో నాలుగు స్థానాలు ఎగబాకి 736 పాయింట్లతో 6వ ర్యాంక్‌ను దక్కించుకోవడం విశేషం. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో షెఫాలీ దూకుడైన బ్యాటింగ్‌తో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించారు.

ఇక భారత జట్టుకు కీలకమైన మరో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 767 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతున్నారు. ఆమె స్థిరమైన ప్రదర్శన భారత బ్యాటింగ్‌కు బలంగా మారింది. అలాగే యువ ప్రతిభావంతురాలు జెమీమా రోడ్రిగ్స్ కూడా 643 పాయింట్లతో 10వ ర్యాంక్‌లో నిలిచి టాప్-10లో చోటు దక్కించుకున్నారు.

ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బెత్ మూనీ 794 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆమె అనుభవం, స్థిరత్వం వల్ల టాప్ ర్యాంక్‌ను నిలుపుకున్నారు. ఒకప్పుడు ఉమెన్స్ మ్యాచెస్ ఎవరు చూసేవారు కాదు ఎప్పుడైతే మన  ప్రతిభను గుర్తించారు అప్పటినుంచి ప్రతి మ్యాచ్ను ప్రజలందరూ ఆదరిస్తూ ఉన్నారు. ఉమెన్స్   కూడా వారి యొక్క ప్రతిభను ఘనపరుస్తూ ఘనమైన విజయాలు సాధిస్తూ ఉన్నారు. ఈ విధంగానే మన భారత మహిళలను ఎంకరేజ్ చేస్తూ మరిన్ని విజయాలు పొందుకోవాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. 

టాప్-10లో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఉండటం భారత మహిళా క్రికెట్ బలాన్ని, లోతైన బ్యాటింగ్ లైనప్‌ను స్పష్టంగా చూపిస్తోంది. రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లు, సిరీస్‌లలో కూడా భారత ఆటగాళ్లు ఇదే ఫామ్ కొనసాగిస్తే మరిన్ని ర్యాంకింగ్ మార్పులు వచ్చే అవకాశం ఉంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.