ఐ బొమ్మ రవిని కస్టడీకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు
ఐ బొమ్మ కేసులో ప్రధాన నిందితుడు ఉమ్మడి రవిని నాంపల్లి కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. పైరసీ, డేటా లీక్, 66 వెబ్‌సైట్లు, 21 వేల సినిమాలు, 50 లక్షల యూజర్ల సమాచారంపై సైబర్ క్రైమ్ కీలక విచారణ కొనసాగిస్తోంది.
* ఐదు రోజులకు కస్టడీకి ఇవ్వాలి
* మరిన్ని వివరాలు ప్రశ్నించనున్న సైబర్ క్రైమ్ పోలీసులు
* 50 లక్షల మంది డేటా లీక్ అయ్యిందా
* ఐ బొమ్మ ఇంకా తొలగిపోయినట్టేనా.
fourth line news : ఐ బొమ్మ నిర్వాహకుడు ఉమ్మడి రవిని కష్టానికి తీసుకున్నారు. పోలీసులు అతడిని బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉమ్మడి రవిని పైరసీ కేసుకు సంబంధించిన వివిధ కోణాలలో అధికారులు ప్రశ్నించునున్నారు. ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
రవి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ఐదు రోజులు కష్టడికి అనుమతి ఇవ్వడం జరిగింది.
ఇప్పటికే అతని పోలీసులు పట్టుకొని విచారించగా భారతీయ భాషలోని 21 వేల సినిమాలను పైరసీ చేసినట్టు తెలుస్తుంది. కరేబియన్ దీవులు కేంద్రంగా చేసుకొని ఆరేళ్లగా 66 వెబ్సైట్లో పైరసీస్ సినిమాలు అప్లోడ్ చేసినట్టు గుర్తించారు. అంతేకాకుండా అతని దగ్గర 50 లక్షల మంది డీటెయిల్స్ సేకరించినట్టుగా తెలుస్తుంది. గేమింగ్ బెట్టింగ్ యాప్ ల నిర్వాహకులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్టు పోలీసులు చెప్పడం జరిగింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0