ముంబై ఘట్‌కోపర్‌లో: కుమార్తెను వ్యభిచారము చేయాలి అని తల్లి ఒత్తిడి...?

ముంబై ఘట్‌కోపర్ ప్రాంతంలో ఒక విద్యార్థిని భద్రతకు సంబంధించిన సంఘటనను స్కూల్ ఉపాధ్యాయులు అధికారులకు తెలియజేయడంతో కేసు నమోదు అయ్యింది. పోలీసులు పలు సెక్షన్ల కింద దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను Fourth Line News అందిస్తోంది.

flnfln
Nov 27, 2025 - 12:25
 0  3
ముంబై ఘట్‌కోపర్‌లో: కుమార్తెను వ్యభిచారము చేయాలి అని తల్లి ఒత్తిడి...?

* సొంత కుమార్తెను వ్యభిచార కృపంలోనికి తల్లి ప్రయత్నం 

* ఘట్‌కోపర్ ప్రాంతంలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది 

* స్నేహితురాలు ప్రోత్సాహంతో స్కూల్ టీచర్ తో బాధను 

* పోలీసులకు ఫిర్యాదు చేసిన స్కూల్ యాజమాన్యం 

* కింద ఉన్న పూర్తి వివరాలు చదవండి 

 fourth line news : అసలు విషయంలోనికి వస్తే ముంబైలోని ఘట్‌కోపర్ ప్రాంతంలో ఒక బాధాకరమైన ఘటన వెలుగులోనికి వచ్చింది. వ్యభిచార కృపంలో దించేందుకు ప్రయత్నించిన కన్నతల్లి. పక్కింటి వ్యక్తితో వ్యభిచారం చేయాలి అని పదవ తరగతి చదువుతున్న తన కుమార్తెను బలవంతము చేసిన తల్లి. కానీ ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. 

బాలిక చెప్పిన సమాచారం ప్రకారం ఏప్రిల్ నుంచి ఈరోజు వరకు తన తల్లి పక్కింటి వ్యక్తితో వ్యభిచారము చేయాలి అని డబ్బులు సంపాదించాలి అంటే ఇదే సరైన మార్గం అని వారు చెప్పేవారని బాధ్యత బాలిక పోలీసులకు చెప్పింది. తన తల్లి ప్రతిరోజు ఈ విధంగా ఒత్తిడి చేస్తుంది అని తన స్నేహితురాలితో తన బాధను పంచుకుంది. ఆమె స్నేహితురాలు ఇచ్చిన మనో ధైర్యంతో స్కూల్ టీచర్ కు ఈ విషయాలు అన్నీ చెప్పారు. 

అలాగే ఈ వేధింపులు తట్టుకోలేకపోతున్నాను అని ఇంట్లో నుండి మూడు రోజులు వరకు తన స్నేహితురాలి ఇంట్లో కూడా ఉన్నాను. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నిందితులు నన్ను బలవంతముగా కొట్టి వ్యభిచార వృత్తిలోనికి నెట్టారని ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ బాలిక పడుతున్న బాధను అంతా తన టీచర్ కి చెప్పినప్పుడు ఉపాధ్యాయురాలు వెంటనే పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అని స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. 

* కన్న తల్లి ఈ విధంగా చేయడం ఎంతో బాధాకరం 

* దీని గురించి మీ అభిప్రాయాన్ని మీరు తెలపండి ! 

* fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.