ఢిల్లీ పేలుడు రహస్యం వీడింది.. కారులో ఉన్నది డాక్టర్ ఉమర్‌నే!
ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడులో మరణించిన వ్యక్తి డాక్టర్ ఉమర్ అని డీఎన్ఏ పరీక్షల ద్వారా అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. — Fourth Line News
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు కేసులో కీలక ఆధారం బయటపడింది. కారు బ్లాస్ట్లో మరణించిన వ్యక్తి డాక్టర్ ఉమర్‌నే అని అధికార వర్గాలు ధృవీకరించాయి. కారులో లభించిన డీఎన్ఏ నమూనాలు ఉమర్ కుటుంబ సభ్యులతో పూర్తిగా సరిపోలినట్లు India Today నివేదించింది.
గుర్తు తెలియని వ్యక్తి 120 కారుతో ఎర్రకోట సిగ్నల్ వద్ద ఆత్మహుతి దాడికి పాల్పడిన ఈ ఘటనలో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా విచారణలో భాగంగా ఉమర్ పేరుతో రిజిస్టర్ చేసిన మరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఈ పేలుడు ఘటనపై భద్రతా సంస్థలు, ఇంటెలిజెన్స్ బృందాలు దర్యాప్తు వేగవంతం చేశాయి.
📰 Fourth Line News
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0