రెండేళ్లుగా సెలవు లేదు.. రోజుకు 18 గంటలు పని: సీఎం రేవంత్ రెడ్డి

సీఎం పదవి భారం కాదు బాధ్యత అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండేళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు లేకుండా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని తెలిపారు. ప్రజల ఆశలు నెరవేర్చడమే తన ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

flnfln
Jan 12, 2026 - 16:18
 0  3
రెండేళ్లుగా సెలవు లేదు.. రోజుకు 18 గంటలు పని: సీఎం రేవంత్ రెడ్డి

* సీఎం రేవంత్ రెడ్డి : సీఎం అంటేనే ఒక బాధ్యత 

* రోజుకి 18 గంటలు నేను పనిచేస్తున్న? 

* సెలవు తీసుకోవాలి అనుకున్నప్పుడే ఏదో ఒక పెద్ద పని? 

* ఈ పదవిని బరువుగా కాదు, బాధ్యతగా చేస్తున్న. 

* పూర్తి వివరాల్లోనికి వెళితే :

 fourth line news : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పాలనలో ఎదురవుతున్న బాధ్యతలపై భావోద్వేగంగా స్పందించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అంటే, రెండేళ్లగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు అని ఆయన తెలిపారు. సెలవు తీసుకోవాలి అని నేను అనుకుంటా కానీ మరుసటి రోజు ఏదో ఒక పెద్ద పని వచ్చి పడుతుంది అని చెప్పారు. అలా రెండేళ్లుగా నేను సీఎం పదవిలో ఉండి అనేక పనులు చేస్తున్నాను అని ఆయన వెల్లడించారు. 

తెలంగాణ సీఎం ఉద్యోగస్తులతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. చాలామంది సీఎం పదవి వస్తే సంతోషంగా, హాయిగా ఉండు చని చాలామంది అనుకుంటారు. సీఎం పదవితో పాటు అనేక బాధ్యతలు, ప్రజలు ఆశలు, సమస్యల పైన మరింత భారం పెంచుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు తీర్చాలి, ప్రజలు సుఖంగా ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి అని అవసరత తనను నిరంతరము కదిలిస్తుంది అని చెప్పారు. 

నేను రెండేళ్లుగా సీఎం పదవిలో కొనసాగుతూ ఉన్నాను, రోజుకు సగటున 18 గంటలు పనిచేసిన కూడా అనేక సమస్యలు కు సమయం సరిపోవట్లేదు అని సీఎం వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు, ప్రజల సమస్యల పరిష్కారం, పరిపాలన నిర్ణయాలు అన్ని ఒకేసారి చూసుకోవాల్సిన అవసరము నా మీద ఉంది అని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ నేను ఇది భారంగా భావించట్లేదు, ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను, అందుకనే ఇంత కష్టపడుతున్నాను అని వెల్లడించారు. 

తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చి దశగా పనిచేయడం నా బాధ్యత, మా ప్రభుత్వం బాధ్యత లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగస్తులు కూడా అదే స్థాయిలో పనిచేస్తే రాష్ట్ర మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది అని సూచించారు. ముఖ్యంగా ప్రజలకు మంచి పాలన అందించాలి అంటే కేవలం రాజకీయ నాయకులు, అధికారులు అందరూ ఏక మనసు కలిగి పని చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ పాలన యొక్క ప్రధాన లక్ష్యము అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

* సీఎం పదవి అంటే అది ఒక బాధ్యతతో కూడిన పదవి. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశం కలిగి ఉంటే ప్రభుత్వం కచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ వార్తపై మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి? మీరే ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉంటే ఏ విధంగా ఉంటారో మీ అభిప్రాయాన్ని తెలి

యజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.