మనవడితో కలిసి నిలువెత్తు బంగారం… మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం. జాతరకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు.
* తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో మేడారం.
* మనవడితో కలిసి నిలువెత్తు బంగారం సమర్పించారు
* కుటుంబ సభ్యులతో, మరియు మంత్రులు పాల్గొన్నారు
* మేడారం జాతరకు సర్వం సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం మేడారంలో జరగబోతున్న సమ్మక్క సారలమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇటీవలే మేడారం జాతరలో కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించి, ముగించడం జరిగింది. ప్రాముఖ్యంగా జాతరలో గద్దెలను పున ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసినదే. ఈరోజు ఉదయం మనవడితో కలిసి నిలువెత్తున బంగారం సమర్పించారు.
సీఎం సతీమణి, కూతురు, అల్లుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం చేరుకొని దావోస్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. మేడారం జాతర ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలి అని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించినట్టుగా అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0