ప్రధాని మోదీ : భారత్ Gen Z యువత ప్రపంచానికి ఆదర్శం

భారత్ Gen Z యువత సామర్థ్యం, స్టార్టప్ విప్లవం, స్పేస్-టెక్ పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు. 1.5 లక్షల స్టార్టప్‌లతో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా ఎదుగుతున్న విషయంపై పూర్తి వివరాలు.

flnfln
Nov 27, 2025 - 15:31
 0  3
ప్రధాని మోదీ : భారత్ Gen Z యువత ప్రపంచానికి ఆదర్శం

* ప్రధాని మోడీ ప్రపంచానికే మన యువత ఒక ఆదర్శం 

* భారత్ ( Gen Z ) యువతపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు 

* వారి శక్తి ఆత్మవిశ్వాసం ప్రపంచానికే ఆదర్శం అని 

* దాదాపుగా 300కు పైగా స్టార్టప్‌ల

* 1.5 లక్షల స్టార్టప్‌లతో భారత్ మూడవ అతిపెద్ద 

* కొత్త వైపు యువత అడుగులు 

 fourth line news : నరేంద్ర మోడీ Gen Z తరం వారు ఎంతో సామర్థ్యం ఆత్మవిశ్వాసము గలవారు అని వారు ప్రపంచానికే ఒక ఆదర్శము అని అభినందించారు. వారికి ఉన్న సూచనాత్మకత ప్రపంచం యువతకు ఒక బెంచ్ మార్కును నిర్దేశించగలమని ఆయన పేర్కొన్నారు. అలాగే గురువారం భారత అంతరిక్ష స్టార్టప్ 'స్కైరూట్'కు చెందిన ఇన్ఫినిటీ క్యాంపస్‌ను, సంస్థ తొలి ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-I'ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించిన సందర్భంగా నరేంద్ర మోడీ ఈ వాక్యాలు చేశారు. 

మన దేశ యువత ప్రతిరంగంలోని సవాళ్లకు పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నారు అని మోడీ మాట్లాడారు. మన యవ్వనస్తులకు ఉన్న గొప్ప విశ్వాసం సృజనాత్మకత ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ ఆవిష్కర్తలకు స్ఫూర్తినిస్తుంది అని ఆయన తెలిపారు. అలాగే భారత్ ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేటుకు తెరిచినప్పుడు మన యువత ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకుంది అని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. 

ప్రధాని మోడీ : ప్రస్తుతం 300కు పైగా స్పేస్ స్టార్టప్‌లు భారత అంతరిక్ష భవిష్యత్తుకు కొత్త ఆశలు కల్పిస్తున్నాయని వెల్లడించారు. 

గత పది సంవత్సరాల్లో భారత్‌లో స్టార్టప్ రంగం విపరీతంగా దూసుకెళ్లిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఒకప్పుడు చిన్న స్థాయిలో ఉన్న స్టార్టప్ కల్చర్, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతూ, భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా నిలబెట్టిందని ఆయన గర్వంగా పేర్కొన్నారు.

ఇప్పటికే దేశంలో 1.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్‌లు ఉన్నాయని మోదీ తెలిపారు. ఇవి కేవలం బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి మెట్రో నగరాల్లోనే కాకుండా—రెండో, మూడో శ్రేణి పట్టణాలు, అంతేకాక గ్రామీణ ప్రాంతాల నుండి కూడా పుట్టుకొస్తున్నాయని తెలిపారు.

ఫిన్‌టెక్, అగ్రిటెక్, హెల్త్‌టెక్ వంటి రంగాల్లో పెద్ద ఎత్తున ఆవిష్కరణలు జరుగుతుండగా, ప్రస్తుతం యువత డీప్‌టెక్, రోబోటిక్స్, హార్డ్‌వేర్ ఇన్నోవేషన్స్ వైపు ముందడుగులు వేస్తోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

భారత యువత సృజనాత్మకత, టాలెంట్, ప్రయోగశీలత ప్రపంచానికి ఆదర్శంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

* మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందటం చాలా ముఖ్యం. 

* మన దేశం గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 

* జై జవాన్ జై కిసాన్

* fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.