ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా – ప్రత్యేక యాప్, సంక్షేమ బోర్డు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం, ప్రత్యేక యాప్, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన ప్రభుత్వం. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ఆటోలో ప్రజల మధ్యకి వెళ్లి జీవన స్థితిగతులు తెలుసుకున్నారు. పూర్తి వివరాలు...

flnfln
Oct 4, 2025 - 19:00
 0  11

Main headlines ; 

1. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక యాప్
ఉబర్, ర్యాపిడో తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు మద్దతుగా ప్రత్యేక యాప్‌ను ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ యాప్ ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా డ్రైవర్ల సంక్షేమానికి వినియోగిస్తారు.

2. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు
ఆటో డ్రైవర్ల భవిష్యత్తుకు భరోసా కల్పించే లక్ష్యంతో ప్రత్యేకంగా 'ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు' ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

3. 'ఆటో డ్రైవర్ సేవలో...' పథకం ద్వారా ఆర్థిక సాయం
రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రూ.436 కోట్లు జమ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందింది.

4. ఆటో డ్రైవర్లతో ప్రత్యక్ష సంప్రదింపులు
చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, మాధవ్ లు లబ్ధిదారుల కుటుంబాలతో ఆటోలో ప్రయాణించి వారి జీవన పరిస్థితులు తెలుసుకున్నారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యారు.

5. రోడ్ల అభివృద్ధి మరియు జరిమానాల తగ్గింపు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 23,000 కిలోమీటర్ల రోడ్లను మరమ్మతు చేసి గుంతలు లేని రహదారులుగా మార్చింది. గత ప్రభుత్వ హయాంలో పెరిగిన జరిమానాలను తగ్గిస్తామని, అనవసర జీవోలను రద్దు చేస్తామని సీఎం చెప్పారు.

6. ప్రజల్లోకి వెళ్లిన నాయకత్వం – ప్రజల నుంచి ప్రత్యక్ష మద్దతు
సీఎం తన నివాసం నుంచి ఆటోలో ప్రయాణించి సభా ప్రాంగణానికి చేరుకోవడం, మార్గమధ్యంలో ప్రజల హర్షధ్వానాలు, స్వాగతం – ఇవన్నీ నాయకత్వం ప్రజల మధ్య ఉండాలని ఆయన నమ్మకాన్ని ప్రతిబింబించాయి.

 పూర్తి వివరాల్లోనికి వస్తే ;

రాష్ట్రంలోని ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు మద్దతుగా, కూటమి ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ల సేవల’ పథకం ప్రారంభోత్సవాన్ని శనివారం విజయవాడలో వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి.

సీఎం చంద్రబాబు తన నివాసం నుండి సభా ప్రాంగణం వరకు ఆటోలో ప్రయాణం చేశారు. సుమారు 14 కిలోమీటర్ల దూరాన్ని ఆయన ఆటోలో ప్రయాణించగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ కూడా విడివిడిగా ఆటోలో వెళ్లి సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
ఆటో డ్రైవర్ సేవలో పథకం లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, మాధవ్ ఆటో ప్రయాణం చేశారు. వారి కుటుంబ పరిస్థితుల గురించి నేతలు వారితో సంప్రదించి తెలుసుకున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రోజుకు 10 నుంచి 12 గంటలపాటు ఆటో నడిపి కుటుంబాన్ని ఆదరిస్తున్నట్లు సీఎం ప్రశ్నించినప్పుడు ఆటో డ్రైవర్ అఫ్సర్ ఖాన్ స్పందించారు. ప్రజలను, ప్రయాణికులను గమ్యస్థలాలకు చేరవేయడంలో చేస్తున్న వారి సేవకు సీఎం ప్రశంసలు తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

తల్లి వందనంలా, దీపం-2.0 వంటి పథకాల గురించి బాగుందా అని చంద్రబాబు తెలుసుకున్నారు. అలాగే, రేషన్ ద్వారా బియ్యం తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. పిల్లలను మంచి విద్య అందించాలని, నాయకత్వ లక్షణాలు పెంచేలా చూసుకోవాలని ఆటో డ్రైవర్ అఫ్సర్ ఖాన్ దంపతులకు సీఎం సూచనలు చేశారు.
చంద్రబాబు సహా ఇతర నేతలు ఆటోలో వెళుతున్నప్పుడు ప్రజలు సంతోషంతో చేతుల జోరుగా స్వాగతం చేశారు. నేతలు ప్రజలకు నమస్కరించి ముందుకు నడిచారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కాళేశ్వరరావు మార్కెట్, ఏలూరు లాకులు, ముత్యాలంపాడు గవర్నమెంటు ప్రెస్ ప్రాంతాల ద్వారా సీఎం మరియు ఇతర నేతలు ఆటోలో ప్రయాణించారు.
సభా ప్రాంగణానికి చేరుకున్న వెంటనే, ప్రయాణ ఖర్చులను చంద్రబాబు మరియు ఇతర నేతలు ఆటో డ్రైవర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ, రవాణ శాఖ ఉన్నతాధికారులు, స్థానిక నేతలు మరియు అధికారులు పాల్గొన్నారు.

ఆటోడ్రైవర్ల కోసం ప్రత్యేక యాప్ ;

  • రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఉబర్, ర్యాపిడో మాదిరిగానే ఓ ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రభుత్వమే తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

  • ఆ యాప్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా డ్రైవర్ల సంక్షేమ కార్యక్రమాలకే వినియోగిస్తామని స్పష్టం చేశారు.

  • ఆటో డ్రైవర్ల భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా 'ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు' ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

  • 'ఆటో డ్రైవర్ సేవలో...' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.436 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.

  • ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి డ్రైవరుకు రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు.

  • గత ప్రభుత్వం ఆటోలపై విధించిన భారీ జరిమానాలను తగ్గిస్తామని, అవసరం లేని జీవోలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 23,000 కిలోమీటర్ల రోడ్లను మరమ్మతులు చేసి గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దామని, దీంతో వాహనాల నిర్వహణ ఖర్చు తగ్గిందని పేర్కొన్నారు.

  • “నేను తెరల వెనకుండి కాదు... ప్రజల్లో నుంచే, ఆటోలో దర్జాగా వచ్చాను” అంటూ గత పాలకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.