ఏపీ గర్భిణీలకు అదిరిపోయే శుభవార్త: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా TIFFA స్కానింగ్..

ఆంధ్రప్రదేశ్ గర్భిణీ స్త్రీలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేల రూపాయలు ఖర్చయ్యే TIFFA స్కానింగ్‌ను ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందించనున్నారు. జనవరి 1 నుండి 7 ప్రధాన ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Dec 22, 2025 - 19:20
 0  4
ఏపీ గర్భిణీలకు అదిరిపోయే శుభవార్త: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా TIFFA స్కానింగ్..

1.ఆంధ్రప్రదేశ్ గర్భిణీ స్త్రీలకు ఒక శుభవార్త తెలిపిన సత్య కుమార్ యాదవ్ 
2. TIFFA స్కానింగ్ సదుపాయాన్ని ఏడు ఆస్పత్రులలో ఏర్పాటు 
3. ఈ స్కానింగ్ వల్ల శిశువు యొక్క లోపాలను ముందుగానే గుర్తించొచ్చు 
4. ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ 4000 వరకు ఖర్చు. 
5. ఈ సద్వినియోగాన్ని గర్భిణీ స్త్రీలందరూ ఉపయోగించుకోవాలి.
6. జనవరి ఒకటి నుంచి ఈ సేవలు ఉచితంగా ప్రారంభమవుతాయి.

కింద ఉన్న సమాచారానంతటిని చదవండి అప్పుడు మీకు మొత్తం అర్థమవుతుంది

ఫోర్త్ లైన్ న్యూస్ కథనం  . ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు ఉచిత TIFFA (Targeted Imaging for Fetal Anomalies) స్కానింగ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఈ అత్యాధునిక స్కానింగ్ సదుపాయాన్ని 7 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయడం గర్వకారణమని ఆయన అన్నారు.

నర్సీపట్నం, తుని, నందిగామ ఏరియా ఆస్పత్రులతో పాటు ఒంగోలులోని మాతా శిశు సంరక్షణ కేంద్రం (MCH), పార్వతీపురం, తెనాలి, అనకాపల్లి జిల్లా ఆస్పత్రుల్లో ఈ TIFFA స్కానింగ్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి వివరించారు. జనవరి 1 నుంచి ఈ సేవలు పూర్తిగా ఉచితంగా ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

TIFFA స్కాన్ ద్వారా 18 నుంచి 22 వారాల గర్భస్థ శిశువులో ఉన్న జన్మత లోపాలను ముందుగానే గుర్తించవచ్చని మంత్రి తెలిపారు. గుండె, మెదడు, వెన్నెముక, మూత్రపిండాలు వంటి కీలక అవయవాల్లో లోపాలను ఈ స్కాన్ స్పష్టంగా గుర్తించగలదని చెప్పారు. దీని వల్ల అవసరమైన వైద్య సూచనలు, చికిత్సలను సమయానికి అందించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ స్కాన్ చేయించుకోవాలంటే గర్భిణులు సగటున ₹4,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందించడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట కలుగుతుందని మంత్రి అన్నారు. ఇది మాతా-శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక ముందడుగు అని చెప్పారు.

భవిష్యత్తులో అవసరాన్ని బట్టి మరిన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా TIFFA స్కానింగ్ సదుపాయాలను విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, గర్భిణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్యకుమార్ కోరారు.

నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధమైన ఉచిత స్కానింగ్లో ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. గర్భిణి స్త్రీలు శిశువు ఏవిధంగా ఉన్నాడు శిశువులో ఏమైనా లోపలు ఉన్నాయా అనేవి ఈ స్కానింగ్ లో స్పష్టంగా గుర్తించవచ్చు. బయట స్కానింగ్ చేపిచ్చుకోవాలి అంటే 4000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పేదలు మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఈ ఖర్చు చాలా ఎక్కువ. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్కానింగ్ పరికరాలు ఏర్పాటు చేయడం గర్భిణీ స్త్రీలు అందరికీ వారి కుటుంబాలకి చాలా సంతోషంగా ఉంటుంది. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ న్యూస్ ని షేర్ చేయడం మర్చిపోమాకండి..  ఫోర్త్ లైన్ న్యూస్ 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.