క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. టోర్నీకి పెర్రీ దూరం!
WPL 2025 కు ముందు ఆర్‌సీబీ స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ జట్టుకు దూరమయ్యారు. ఆమె స్థానంలో సయాలీ సతఘరే జట్టులోకి వచ్చారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
1.RCB కి బిగ్ షాప్ తగిలింది!
2. పోయిన సీజన్లో అద్భుతమైన ప్రదర్శన! కానీ
3. త్వరలోనే స్టార్ట్ అవుతుంది WPL?
4. ఎవరు గెలుస్తారో అస్సలకి చెప్పలేం?
JAN 9 నుంచి ప్రారంభం కానున్న మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ ఈ సీజన్‌కు దూరమవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని పెర్రీ వెల్లడించారు. దీంతో టైటిల్ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన RCB వ్యూహాలపై ఈ మార్పు ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఎల్లీస్ పెర్రీ గైర్హాజరుతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి భారత ఆల్‌రౌండర్ సయాలీ సతఘరేను జట్టులోకి తీసుకున్నట్లు RCB మేనేజ్‌మెంట్ తెలిపింది. దేశీయ క్రికెట్‌లో మంచి అనుభవం కలిగిన సయాలీ, బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
2024 WPL సీజన్‌లో RCB టైటిల్ సాధించడంలో ఎల్లీస్ పెర్రీ కీలక పాత్ర పోషించారు. కీలక మ్యాచ్‌ల్లో ఆమె చేసిన పరుగులు, ముఖ్యమైన వికెట్లు జట్టును విజయపథంలో నడిపించాయి. ముఖ్యంగా నాకౌట్ దశలో ఆమె ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాంటి ప్లేయర్ ఇప్పుడు ఈ సీజన్లో ఆడుతూ అని తెలిసినప్పుడు అభిమానులు కొంత ఆందోళనకి గురయ్యారు.
ఇదిలా ఉండగా, ఈ సీజన్ WPLకు మరికొంతమంది ప్రముఖ విదేశీ ఆటగాళ్లు కూడా దూరమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన అన్నాబెల్ సదర్లాండ్, యూపీ వారియర్స్ తరఫున ఆడాల్సిన తారా నోరీస్ కూడా వ్యక్తిగత మరియు ఆరోగ్య కారణాలతో టోర్నీకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. వరుసగా స్టార్ ప్లేయర్లు తప్పుకోవడం వల్ల ఆయా జట్లు తమ కాంబినేషన్లను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మొత్తంగా చూస్తే, WPL 2025 సీజన్‌కు ముందు జట్లకు ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ యువ ఆటగాళ్లకు ఇది మంచి అవకాశం అవుతుందని, కొత్త టాలెంట్ వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తంగా చూసుకు ఈ సీజన్లో ఆడే బిపిఎల్ క్రికెట్కు అభిమానుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మెన్స్ ఐపీఎల్ ను ఎలా అయితే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు ! అదేవిధంగా ఉమెన్స్ wpl క్రికెట్ ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. వచ్చే సీజన్లో ఏటీఎం గెలుస్తుందో అని ప్రేక్షకులలో ఇప్పటినుంచే ఆసక్తిగా ఉంది.
*మరి నిజానికి వచ్చే సీజన్లో ఏటీఎం గెలుస్తుందో మీరు చెప్పగలరా?
*మీ యొక్క అమూల్యమైన ఆలోచనను షేర్ చేసుకోండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0