కోహ్లీ అవుట్ అవ్వాలి అని కోరుకుంటున్న ఆపోజిట్ టీం? అసలేం జరిగింది

విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లి అద్భుత ఫామ్. గుజరాత్‌పై 61 బంతుల్లో 77 పరుగులు చేసి రన్ మెషీన్‌గా తన ముద్ర వేశారు. కోహ్లి లేటెస్ట్ రికార్డులు మరియు ఇన్నింగ్స్ వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Dec 26, 2025 - 13:33
 0  3
కోహ్లీ అవుట్ అవ్వాలి అని కోరుకుంటున్న ఆపోజిట్ టీం? అసలేం జరిగింది

1. విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఎంత కొట్టాడో తెలుసా? 
2. 29 బంతుల్లోనే ఆప్ సెంచరీ పూర్తి చేయడం. 
3. ఈ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు ఒక సిక్స్. 
4. 74, 135, 102, 65, 131, 77 రన్ మెషిన్ అంటారెందుకే 
5. అభిమానుల్లో కొత్త ఉత్సాహం. 
6. పూర్తి విషయాలు తెలియాలి అంటే కింద ఉన్న సమాచారాన్ని అంతటిని చదవండి.

ఇటీవల కాలంలో మరోసారి విరాట్ కోహ్లి తన క్లాస్ ఏంటో నిరూపించారు. క్రికెట్ ప్రపంచంలో కోహ్లికి ఉన్న స్థానం ప్రత్యేకం. ఫామ్‌లో ఉన్నప్పుడు ఆయన బ్యాట్ మాట్లాడితే, రికార్డులు తానే వెతుక్కుంటూ వస్తాయి. విజయ్ హజారే ట్రోఫీలో తాజాగా ఆయన ఆడిన ఇన్నింగ్స్ కూడా అందుకు నిదర్శనంగా నిలిచింది.

బెంగళూరు వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విరాట్ కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 61 బంతుల్లో 77 పరుగులు చేసి ఔటైన కోహ్లి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక భారీ సిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన బ్యాటింగ్‌లో కనిపించిన ఆత్మవిశ్వాసం, టైమింగ్, షాట్ సెలక్షన్ అభిమానులను మరోసారి ఆకట్టుకున్నాయి. మ్యాచ్ ప్రారంభం నుంచే బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన కోహ్లి, ఫీల్డర్లకు అవకాశమే ఇవ్వకుండా బంతిని గ్యాప్‌లలోకి పంపించారు.

ఈ ఇన్నింగ్స్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయడం. ఇది ఆయన దూకుడును, అలాగే పరిస్థితికి తగ్గ ఆటను ఎంత చక్కగా ఆడతారో మరోసారి చూపించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఆడిన కోహ్లి, సెట్ అయిన తర్వాత మాత్రం గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కవర్స్ మీద డ్రైవ్స్, స్క్వేర్ కట్‌లు, స్ట్రెయిట్ షాట్లు ఆయన ట్రేడ్‌మార్క్‌లా కనిపించాయి.

గత కొన్ని లిస్ట్-A మ్యాచ్లను పరిశీలిస్తే కోహ్లి ఫామ్ ఎంత అద్భుతంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. వరుసగా 74*, 135, 102, 65*, 131, 77 వంటి స్కోర్లు చేయడం అంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది కేవలం రన్స్ గురించే కాదు, ఆయన ఆటలో ఉన్న నిలకడ, బాధ్యత, నాయకత్వ లక్షణాల గురించి కూడా చెప్పుకోదగిన విషయం. ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు అవసరమైన సమయంలో నిలబడి ఇన్నింగ్స్‌ను నడిపించడం కోహ్లి ప్రత్యేకత.

కోహ్లీ లాంటి ఒక స్టార్ ఆటగాడు దేశవాళీ మ్యాచులు ఆడుతున్నాడు అంటే క్రికెట్ పై ఆయనకి ఉన్న ప్రేమ ఇక్కడ మనకి అర్థమవుతుంది. అలాగే యువ ఆటగాళ్లకు కూడా ఒత్తిడిని ఎలా ఎదుర్కొని ఆడాళ్ళు కూడా సీనియర్ ప్లేయర్స్ నుంచి నేర్చుకునే అవకాశం ఉంది. 

కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అభిమానుల మనసును ఎన్నోసార్లు గెలుచుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో విమర్శలు కూడా ఎదుర్కొనవలసి వచ్చింది. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మరింత ప్రోత్సాహాన్ని బలాన్ని అందుకొని మ్యాచ్ ఆడగలిగిన సత్తా కోహ్లీ వ్యక్తిత్వంలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫార్మ్ చూస్తే మరలా కోహ్లీ పీక్ దేశ కు చేరుకుంటాడు అనే అభిప్రాయాలు క్రికెట్ అభిమానుల్లో ప్రాముఖ్యంగా RCB అభిమానుల్లో బలంగా వినిపిస్తున్నాయి. 


మొత్తానికి విజయ్ హజరే ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఆడుతున్న ఆటను చూస్తుంటే ఎందుకు ఆయనని రన్మిషన్ గా పిలుస్తారు ఇప్పుడు అర్థమవుతుంది. బ్యాడ్ తో క్లాస్, అనుభవంతో మెచ్యూరిటీ, ఆటపై అపారమైన ఆకలి ఇవి అన్ని కలిసినప్పుడే కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడు తయారవుతాడు. రాబోయే మ్యాచ్లలో కూడా ఈ విధంగానే ఆడాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.

మరి కోహ్లీ ఆట మీకు ఎలా అనిపించింది? 
కోహ్లీపై మీకున్న అనుభవాన్ని కచ్చితంగా కామెంట్ చేయండి. ? 
క్రికెట్ లో మీకు ఇష్టమైన ప్లేయర్ని అతని గురించి మీకు నా అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫోర్త్ లైన్ న్యూస్ చదువుతున్న మీ అందరికీ మా ధన్యవాదాలు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.