నాలుగు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు: VHTలో పడిక్కల్ అద్భుతం
విజయ్ హజరే ట్రోఫీలో దేవదత్ పడిక్కల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రెండు సీజన్లలో 700కు పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. జగదీశన్ 830 పరుగులతో టాప్‌లో ఉండగా, పడిక్కల్ రెండో స్థానంలో నిలిచాడు.
* విజయ్ హజరే ట్రోఫీ 830 పరుగులతో మొదటి ప్లేస్?
* రెండవ స్థానంలో పడిక్కల్ సరికొత్త చరిత్ర నిర్మించాడు
* నాలుగు సెంచరీలు, రెండు అర్థ సెంచరీలతో చరిత్ర?
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : విజయ్ హజరే ట్రోఫీ లో పడిక్కల్ సరికొత్త చరిత్ర నిర్మించాడు. కర్ణాటక యువ బ్యాట్స్మన్ దేవదత్ పడిక్కల్ మరో అరుదైన ఘనత సాధించాడు. దేశవాళీ వన్డే క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసి తన ఆటను అందరికీ కనపరిచాడు. విజయ్ హజరే ట్రోఫీ చరిత్రలో రెండుసార్లు 700 పైగా పరుగులు చేసి తొలి ప్లేయర్గా రికార్డ్ తన పేరుపై సృష్టించాడు.
2021 సీజన్లో 737 పరుగులు చేసి పడిక్కల్, ప్రస్తుతం జరుగుతున్న సీజన్లో ఇప్పటికీ 721 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్ లో ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఈ సీజన్లో ఆయన బ్యాటింగ్, సహనం, దూకుడు అన్ని అతనికి సహకరించి అద్భుతంగా ఆడే విధంగా చేశాయి అని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే కీలకమైన మ్యాచుల్లో జట్టును ముందుకు నడిపించే ఇన్నింగ్స్ ఆడి అభిమానులను ఎంతో ఆకట్టుకున్నాడు.
ఈ సీజన్లో పడిక్కల్ నాలుగు సెంచరీలు, రెండు అర్థ సెంచరీలు చేయడం విశేషంగా మారింది. టాప్ ఆర్డర్స్ బ్యాట్స్ మానుగా పవర్ ప్లే బలమైన అభ్యర్థిగా అవ్వడమే కాకుండా అన్ని సమయములో కూడా మంచి ఇన్నింగ్స్ ను ఆడి టీమును విజయాలలోనికి తీసుకువెళ్లాడు
ఒకే సీజన్లో అధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఇప్పటికీ తమిళనాడు బ్యాట్స్మెన్ నారాయణ్ జగదీశన్ నిలిచాడు దాదాపుగా 830 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. నిజానికి విజయ్ హజరే ట్రోఫీ చరిత్రలోనే పరిశీలిస్తే అత్యధికమైన పరుగులు చేసింది ఇతడే. అయితే రెండో స్థానంలో 700 టైగర్ రన్స్ చేసింది ఘనత మాత్రం పడిక్కల్ కే దక్కుతుంది.
ఇదే విధంగా పడిక్కల్ మంచి ప్రదర్శన ఇస్తే కర్ణాటక జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించినట్టేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ ఫామ్ కొనసాగితే భారత జాతీయ జట్టులో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అభిమానుల్లో కొత్త ఉత్సవాన్ని నింపుతూ ఇంకా మంచి కాడలి అని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.
మన టీమిండియా కు ఇలాంటి ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ వస్తే మన టీం ఏ విధంగా ఉంటుందో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0