హార్దిక్ 93, రింకు సింగ్ 100, ఆర్యన్ 134 , తగ్గదలంటున్న బ్యాటర్స్ .?

విజయ్ హజారే ట్రోఫీలో రింకూ సింగ్ మెరుపు సెంచరీతో చెలరేగగా, విరాట్ కోహ్లీ మరియు రిషబ్ పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ టోర్నీ విశేషాలు మరియు తాజా అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.

flnfln
Dec 26, 2025 - 14:04
 0  3
హార్దిక్ 93, రింకు సింగ్ 100, ఆర్యన్ 134 ,  తగ్గదలంటున్న బ్యాటర్స్ .?

1. కెప్టెన్ డ్రింకు సింగ్ 56 బంతుల్లోనే సెంచరీ. 
2. ఆర్యన్ 134 పరుగులు చేశాడు 
3.  హార్దిక్ 93 పరుగులతో బౌలర్లకి చుక్కలు చూపిస్తున్నాడు 
4.రోహిత్ శర్మ అభిమానులను నిరాశ పరిచాడు
5. సీనియర్  ప్లేయర్లు అనుభవంతో ఆడుతున్నారు. 
6. పూర్తి విషయాలు తెలియాలి అంటే కింద ఉన్న సమాచారాన్ని చదవండి. 

 ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ;విజయ్ హజారే దేశవాళీ క్రికెట్ అభిమానులకు ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఆటగాళ్లు ఆడుతున్న తీరును చూస్తే అభిమానుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది ముఖ్యంగా ఈ టోర్నీలో యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ స్టార్లు కూడా తమ సత్తా చాటుతూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా జరిగిన మ్యాచ్‌ల్లో రింకూ సింగ్, ఆర్యన్ జుయల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, హార్దిక్ తమోరే వంటి ఆటగాళ్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో వార్తల్లో నిలిచారు.

చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ (UP) జట్టు కెప్టెన్ రింకూ సింగ్ అసాధారణ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి అభిమానులను ఆకట్టుకున్నాడు  కేవలం 56 బంతుల్లోనే సెంచరీ సాధించి దేశవాళీ క్రికెట్‌లో తన పేరు మరింత బలంగా ముద్ర వేసుకున్నారు. బౌలర్లపై ఒత్తిడి తేవడమే కాకుండా, ఫీల్డ్‌ను చక్కగా ఉపయోగిస్తూ బంతిని గ్యాప్‌లలోకి పంపించారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ఆయన ఆట మ్యాచ్‌ను పూర్తిగా UP వైపుకు తిప్పేసింది.

రింకు సింగ్ ఆడుతున్నప్పుడు అతనికి సహకరించిన  ఆటగాడు ఆర్యన్ జుయల్. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జుయల్ 134 పరుగులు చేసి భారీ స్కోరుకు బలమైన పునాది వేశారు. ఆరంభం నుంచే బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన జుయల్, ఎక్కువసేపు క్రీజ్‌లో నిలబడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లాడు . జుయల్–రింకూ జంట మధ్య జరిగిన భాగస్వామ్యం మ్యాచ్‌కు కీలకంగా మారింది. ఫలితంగా UP జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇది టోర్నీలోనే అత్యంత ప్రభావవంతమైన స్కోర్లలో ఒకటిగా నిలిచింది.

అలాగే ఈ దేశ సమయంలో మరో మ్యాచ్ ఢిల్లీ జట్టు గుజరాత్ తలపడగా ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ తమ అనుభవనం అంతటిని ప్రదర్శించారు. విరాట్ కోహ్లీ అయితే 74 పరుగులు చేసి మరోసారి తన సత్తా చూపించాడు. అంత అయితే 70 పరుగులతో జట్టును ఆకట్టుకున్నారు. కోహ్లీ ఆడిన తీరుని చూస్తుంటే అతని ఎంత మెచ్చుకున్న తక్కువే అని అభిమానులు అంటున్నారు. పంతు మాత్రం తన సహజ శైలిలో దూకుడుగా ఆడే ప్రేక్షకులను ఉత్సాహపరిచాడు. అయితే ఇతర బ్యాట్స్మెన్ పెద్దగా ఆడకపోవటంతో ఢిల్లీ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 254 పరుగులకే పరిమితవటం జరిగింది. 


ముంబై చెట్టు ఉత్తరాఖండ్తో తలబడింది. అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారు. త్వరగా అవుట్ అయినప్పటికిని జట్టు మాత్రం వెనుకడుగు వెయ్యలేదు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన హార్దిక్ అద్భుతంగా రానిచి 93 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్లో హార్దిక్ ఆడిన ఆట ఎప్పటికీ మర్చిపోలేనిది. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు సాధించడం ద్వారా ముంబై జట్టు స్కోర్ ను భారీగానే చేసింది. ఫలితంగా ముంబై 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 331 పరుగులు చేసింది. 

ఈ విజయ్ హజరే ట్రోఫీ సీజన్ బ్యాట్స్మెన్  అందరూ తమ యొక్క సత్తాను చూపెడుతూ ఉన్నారు ముఖ్యంగా  , రింకు సింగ్, ఆర్యన్ ,  ఆడిన ఆట అందరిని ఆకట్టుకుంది ఫ్యూచర్లో వీళ్లు అద్భుతంగా రాణించే అవకాశం కూడా ఉంది. అయితే మరోపక్క సీనియర్లు లేయర్లైన కోహ్లీ, పంత్, రోహిత్ లాంటి ప్లేయర్లు అనుభవంతో మ్యాచ్లను ఆకట్టుకుంటున్నారు. ఈ టోర్నీ ఇలాగనే సాగితే రాబోయే రోజుల్లో మరింత ఆటగాళ్లు ఆడి అభిమానులు హృదయాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి అని టికెట్ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. 


మరి ఈ ఆటలో మీకు ఏ టీం అంటే ఇష్టం ? 
మీరు ఎవరికీ సపోర్ట్ చేస్తున్నారు మీ ప్లేయర్ ఎవరు ? 
మీ అనుభవాన్ని కచ్చితంగా తెలియజేయండి. ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా అన్ని వార్తలను వేరు చదవవచ్చు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.