హైదరాబాద్ NIRDPRలో ఉద్యోగాలు | PG, B.Tech అర్హతతో 4 కాంట్రాక్ట్ పోస్టులు
హైదరాబాద్ NIRDPRలో 4 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ. PG, B.Tech, M.Tech, MCA అర్హతతో Jan 22 వరకు అప్లై చేయొచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ.
హైదరాబాద్ NIRDPRలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీ రాజ్ (NIRDPR) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు PG (బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ / సోషల్ సైన్సెస్ / డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ / రూరల్ డెవలప్‌మెంట్ / మేనేజ్‌మెంట్ / సోషల్ వర్క్) లేదా B.Tech / M.Tech / MCA అర్హత కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండటం తప్పనిసరిగా పేర్కొన్నారు.
అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 50 ఏళ్లు మించకూడదు. ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం వేతనం చెల్లించబడుతుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తుల పరిశీలన
షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్ (అవసరమైతే)
దరఖాస్తు విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జనవరి 22.
అధికారిక వెబ్‌సైట్:
యువతలో ఎవరైతే గ్రామ అభివృద్ధి, పంచాయితీ రాజ్ రంగాలలో కెరీర్ కోరుకునే వారికి ఇదొక మంచి అవకాశం అని అధికారులు వెల్లడిస్తున్నారు. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు చివరి తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి అని NIRDPR తెలియజేస్తుంది
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0