ఓటమిపై పంత్ క్షమాపణలు – మరింత దృఢంగా తిరిగివస్తామని హామీ

టీమిండియా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోవడంతో రిషబ్ పంత్ అభిమానులకు క్షమాపణలు తెలిపారు. జట్టులో లోపాలను సరిచేసుకుని మరింత బలంగా తిరిగివస్తామని హామీ ఇచ్చారు. Fourth Line News నుంచి పూర్తి వివరాలు.

flnfln
Nov 27, 2025 - 16:23
Nov 27, 2025 - 16:27
 0  3
ఓటమిపై పంత్ క్షమాపణలు – మరింత దృఢంగా తిరిగివస్తామని హామీ

* టీమిండియా ఓటమిపై క్షమాపణలు చెప్పిన పంత్ 

* సౌతాఫ్రికాతో భారత్ మ్యాచ్ లో భారత్ ఘోరంగా ఓటమి

* భారత్ బ్యాటింగ్ అంతా ఫెయిల్ అయ్యారు 

* అభిమానులను అంచనాలను అందుకోలేకపోయామని 

* మంచిగా ఆడ లేకపోయాము అని బహిరంగంగా అంగీకారం 

* మరింత దృఢంగా పుంజుకుంటామని హామీ 

fourth line news : సొంత గడ్డ పైన సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘోరంగా విఫలం అయింది. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ స్పందించడం జరిగింది. మా టీమ్ అంతా మంచి క్రికెట్ ఆడలేదని, అభిమానులను అంచనాలను మేము అందుకోలేకపోయాము అని క్షమాపణలు తెలిపారు. కచ్చితంగా మళ్ళీ పుంజుకొని మరింతగా దృఢంగా తిరిగి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 

రెండు టెస్టుల సిరీస్ ను భారత్ 0- 2 తేడాతో మ్యాచ్ను కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే రిషబ్ పంత్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. గత రెండు వారాలుగా మేము సరిగ్గా ప్రదర్శించలేదు అన్నది వాస్తవం. ఓకే జట్టుగా ఆటగాళ్ళముగా మేము మంచిగా ప్రదర్శన చేసి కోట్లాదిమంది భారతీయుల ముఖములో చిరునవ్వు చూడాలి కానీ ఈసారి మేము ఆ అంచనాలను అంటుకోలేకపోయాము మమ్మల్ని క్షమించండి. టీం లో ఉన్న లోపాలను మేము సరి చేసుకుని మరింతగా మీ మద్దతును మేము పొందుకుంటాము. మీ మద్దతుకు ధన్యవాదాలు అని ఆయన తెలియజేశారు. 

శుభ్‌మన్ గిల్ గాయం కారణాలవల్ల జరిగిన రెండో టెస్టుకు దూరం అయ్యాడు అయితే అప్పుడు పంత్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో భారత్ 408 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. 2000 తరువాత భారత్ గడ్డపై ఆఫ్రికాకు ఇది రెండో టెస్ట్ సిరీస్ విజయముగా మారింది.  అలాగే మ్యాచ్ సౌతాఫ్రికాతో పూర్తిగా స్వాధీనం చేసుకుంది. మేము ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాము అదే మా ఓటమికి కారణమైంది అని ఓటమికి గల కారణాలు ఆయన వెల్లడించారు. 

*  మన గడ్డపైన మన ప్లేయర్లు ఓడిపోవడం చాలా బాధాకరం 

* కానీ మన గడ్డపైకి వచ్చి వాళ్లు మంచిగా ఆడి గెలవడం ఇది ఒక గొప్ప విషయం వాళ్లకి. 

* కానీ ఓడిపోయిన కూడా మనవాళ్ళకి మనము సపోర్ట్ చేయాలి అది మన హక్కు 

* మీ యొక్క మూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.