టీమిండియా ప్లేయర్స్ కు గాయాలు
దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ముందే శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గాయాలతో టీమిండియా ఇబ్బందుల్లో పడింది. ఇద్దరూ దూరమైతే తాత్కాలిక కెప్టెన్సీ కోసం కేఎల్ రాహుల్, అక్సర్ పటేల్ పేర్లు ముందున్నాయనే సమాచారం. పూర్తి వివరాలు Fourth Line News లో.
టీమిండియా ప్లేయర్స్ కు గాయాలు
. శుభ్‌మన్ గిల్, ఆడతాడా
. ఇప్పుడు ముందుంది నడిపించేది ఎవరు
. ఈ సిరీస్ గెలవాలి.
దక్షిణాఫ్రికా తో త్వరలో ప్రారంభం కానున్న మూడో వన్డేల సిరీస్ కు ముందు భారత జట్టులో మెయిన్ ప్లేయర్స్ తీవ్ర గాయాలతో బాధపడుతున్నారు. మెయిన్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ గాయాల పాలయ్యారు. ఇద్దరూ ముందు జరగబోయే ఆటలో ఆడతారో ఆర్డరు ఇంకా స్పష్టం కాలేదు. దీంతో జట్టుకు తాత్కాలిక కెప్టెన్ ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
మొన్న జరిగిన కోల్కత్తా టెస్టులో శుభ్‌మన్ గిల్, మెడకు గాయమైంది. దీంతో అతడు వన్డే సిరీస్ ఉంటాడు ఉండడు అని అనేక సందేహాలు వస్తూ ఉన్నాయి. అలాగే మరోవైపు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కూడా గాయాలతో ఉన్నట్టు మనకి తెలిసిన విషయమే. ఒకవేళ వీళ్ళిద్దరూ ఆ సిరీస్ కు దూరమైతే మరి ఎవరు టీం కి కెప్టెన్ గా ఉండి నడిపిస్తారో చూడాలి మరి.
ప్రెసెంట్ అయితే తాత్కాలికమైన కెప్టెన్సీలో కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ ముందంజలో ఉన్నారు అని సమాచారం వస్తుంది. వీరిద్దరూ ఐపీఎల్లో నాయకత్వం వహించిన అనుభవం కూడా ఉంది కాబట్టి మరి వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకుంటారో చూడాలి మరి. రాహుల్ ఢిల్లీకి , అక్షర పటేల్ పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్త్ గా వ్యవహరించారు. జాతీయ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం పరంగా చూస్తే రాహుల్ కే ఎక్కువ కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి గతంలో కూడా రాహుల్ టెస్టులలో జట్టును ముందుండి నడిపించాడు.
ఈ నేపథ్యంలో సెలెక్టెడ్లు ఎవరి వైపు ముగ్గు చూపుతారనేది ఉత్కంఠగా మారింది. అనుభవం ఉన్న రాహుల్ కు కెప్టెన్సీ ఇస్తారా లేక యువ ఆటగాడైన అక్షర్ పటేల్ కు అవకాశం ఇచ్చి చూస్తారా అనేది వేచి చూడాల్సిందే.
fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0