23 బంతుల్లో ఆఫ్ సెంచరీ! పృథ్వీ షా మళ్లీ అడరగొట్టాడు – ఐపీఎల్ వేలానికి ముందు
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పృథ్వీ షా 23 బంతుల్లో ఆఫ్ సెంచరీతో మెరిశాడు. 36 బంతుల్లో 66 పరుగులు చేసి ఐపీఎల్ మినీ వేలానికి ముందు తన పవర్ చూపించాడు. పూర్తి వివరాలు – Fourth Line News.
* జస 23 బాలల్లోనే ఆప్ సెంచరీ తన పవర్ ని చూపెట్టాడు
* పృథ్వీ షా తన ఆటతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు
* సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుపు దాడి
* హైదరాబాద్ పై 36 బంతుల్లో 66 పరుగులు
* డిసెంబర్ 15న జరగనున్న ipl వేలంపై ప్రత్యేక దృష్టి
* గత ఏడాది ఐపీఎల్ లో అమ్ముడుపోని పృథ్వీ షా
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే
స్పోర్ట్స్ న్యూస్
ఫోర్త్ లైన్ న్యూస్ : మనందరికీ తెలిసిన ఆటగాడు కానీ కొద్ది కాలంగా తన ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోసం చాలా ఇబ్బంది పడ్డ ఓపెనర్ పృథ్వీ షా మళ్లీ తన యొక్క ఆటను ప్రదర్శించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈరోజు హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర కెప్టెన్ గా బరిలోనికి దిగిన పృథ్వీ షా విధ్వంసకరమైన ఆటను ప్రదర్శించాడు. 36 బంతుల్లో 9 ఫోర్లు మూడు సిక్స్లతో 66 పరుగులు చేసి రాబోయే ఐపీఎల్ మినీ వేలానికి ముందు తన యొక్క బలమైన సంకేతాలు పంపాడు అని విశ్లేషకులు అంటున్నారు.
హైదరాబాద్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోనికి దిగిన పృథ్వీ షా అదిరిపోయే ప్రారంభాన్ని ఇచ్చి జట్టుకు బలమైన దృఢ సంకల్పాన్ని అందించాడు. 23 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ పూర్తి చేసి తన ఉద్దేశాన్ని సాటాడు. అలాగే మరో ఓపెన్ అర్షిన్ కులకర్ణితో కలిసి తొలి వికెట్‌కు 73 బంతుల్లోనే 117 పరుగుల భాగస్వామ్యం చేరుకున్నారు. గైక్వాడ్ జాతీయ జట్టుకు ఎంపిక అవడంతో పృథ్వీ షా మహారాష్ట్రకు కెప్టెన్సీ బాధ్యతలు వహిస్తున్నాడు.
గత ఏడాది వివిధ కారణాలవల్ల పృథ్వీ షా ఐపీఎల్ కాంట్రాక్ట్ కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్ తనను విడుదల చేయగా ఏ జట్టు అతన్ని కొనుగోలు చేయలేదు. ముంబై జట్టులో అవకాశాలు లేకపోవడంతో ఈ సీజన్లో మహారాష్ట్రకు పృథ్వీ షా మారాడు. ఈ టోర్నమెంట్ ఆరంభంలో ఐదు పరుగులకే అవుటైనప్పటికిని, రెండో మ్యాచ్లో ఒత్తిడిని అధిగమించి కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొడుతున్నాడు.
వచ్చే నెలలో జరిగే డిసెంబర్ 15న అబుదాబిలో ఐపీఎల్ మినీ వేలం జరుగుతున్న నేపథ్యంలో పృథ్వీ షా తన సామర్థ్యాన్ని మళ్ళీ ప్రదర్శించాడు. తన ప్రదర్శన మళ్లీ ఐపీఎల్లో అడుగు పెట్టేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి అని విశ్లేషకులు భావిస్తున్నారు. తన ఆటను ఈ విధంగా కొనసాగిస్తే అతని దక్కించుకునేందుకు ఎన్నో ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం లేకపోలేదు.
* పృథ్వీ షా మళ్లీ ఐపీఎల్ ఆడాలని ఎంతమంది కోరుకుంటున్నారు.
* ఐపీఎల్ లో మీకు ఏ టీమ్ అంటే ఇష్టం ఏ ప్లేయర్ అంటే ఇష్టమో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0