కోహ్లీ, రోహిత్ ఆడుతున్నా లైవ్ రావడం లేదా? విజయ్ హజారే ట్రోఫీపై

విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పునరాగమనం చేసినప్పటికీ, లైవ్ స్ట్రీమింగ్ లేకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.

flnfln
Dec 23, 2025 - 21:01
Dec 23, 2025 - 21:27
 0  5
కోహ్లీ, రోహిత్ ఆడుతున్నా లైవ్ రావడం లేదా? విజయ్ హజారే ట్రోఫీపై

1. విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ రోహిత్ ఆడుతున్నారు 
2. ఢిల్లీ ఏపీ మ్యాచ్ బెంగళూరులో, మిగిలినవి... 
3. ఈ రెండు మ్యాచ్లకు టీవీ ప్రసారం ఆన్లైన్ లేవు. ఎందుకు 
4. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అభిమానులు ఈరోత్సాహం 
5. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కు సన్నాహాలు సిద్ధం 
6. భవిష్యత్తులో జరిగే దేశీయ మ్యాచ్లకు ఆన్లైన్ పెట్టాలి. 
7. కింద ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదవండి అప్పుడు అన్ని విషయాలు మీకు అర్థం అవుతాయి.

ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ;భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఘడియలు చివరకు నిరాశతో ముగిశాయి. భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత దేశీయ టోర్నమెంట్ అయిన విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో బిజీ షెడ్యూల్ కారణంగా దేశీయ మ్యాచులకు దూరంగా ఉన్న ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు మళ్లీ గ్రౌండ్‌లో కనిపించబోతుండటంతో ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహం నెలకొంది. కానీ, వారి ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

బుధవారం జరగనున్న ఢిల్లీ–ఆంధ్రప్రదేశ్ మ్యాచ్ బెంగళూరులో, ముంబై–సిక్కిం మ్యాచ్ జైపూర్లో జరుగుతున్నాయి. ఈ రెండు మ్యాచుల్లో వరుసగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పాల్గొననున్నారు. అయితే ఈ మ్యాచులకు సంబంధించి ఆన్లైన్ స్ట్రీమింగ్ లేదా టీవీ బ్రాడ్‌కాస్ట్ ఏర్పాట్లు బీసీసీఐ చేయకపోవడం పెద్ద వివాదానికి దారి తీసింది. స్టార్ క్రికెటర్లు ఆడుతున్నా కూడా మ్యాచ్‌ను చూడలేని పరిస్థితి ఏర్పడటంపై అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ హజారే ట్రోఫీ భారత దేశీయ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వన్డే టోర్నమెంట్. ఇలాంటి టోర్నమెంట్‌లో భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు సన్నాహకంగా ఈ మ్యాచ్లు ఉపయోగపడతాయని అభిమానులు భావించారు. అంతేకాకుండా, వీరిద్దరి ఫామ్ ఎలా ఉందో చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

కానీ, బీసీసీఐ సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల అభిమానుల ఆశలు అడియాసయ్యాయి. ప్రస్తుతం దేశంలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు విస్తృతంగా ఉన్నప్పటికీ, ఇలాంటి కీలక మ్యాచులకు స్ట్రీమింగ్ సదుపాయం కల్పించకపోవడం విమర్శలకు గురవుతోంది. కనీసం యూట్యూబ్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా అయినా లైవ్ కవరేజ్ ఇవ్వాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

అభిమానులు స్టేడియం కి వెళ్లి మ్యాచ్ చూసే అవకాశం లేదు, అలాగే టీవీ మొబైల్ ద్వారానే తమ ఆటగాళ్ల ఆటలు చూడటానికి అలవాటు పడిపోయారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆఫ్ లైన్ కే పరిమితం చేయడం పట్ల అభిమానులందరూ చాలా నిరాశకు గురయ్యారు. ఒక మాటలో చెప్పాలి అంటే విరాట్ కోహ్లీ రోహిత్ లాంటి సూపర్ స్టార్ దేశీయ క్రికెట్లలో కనిపించడం చాలా అరుదు అలాంటి సమయంలో పూర్తిగా ఈ మ్యాచ్లను ఆఫ్లైన్ పెట్టడం వల్ల అభిమానులలో ఎంతో బాధ కలుగుతుంది అని అర్థమవుతుంది. 


అలాగే ఈ మ్యాచ్ లన్ని విరాట్, రోహిత్ శర్మ కు ఎంతో కీలకంగా మారాయి. అంతర్జాతీయ క్రికెట్ లలో మళ్లీ వీరిద్దరు పుంజుకునే విధంగా దేశీయ మ్యాచులు మంచి వేదికగా నిలుస్తాయి అని అభిమానులు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే విరాట్ కింగ్ కి ఇది ఆత్మవిశ్వాసం పెంచుకునే అవకాశం ఈ మ్యాచ్లో కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే రోహిత్ శర్మకు నాయకత్వంతో పాటు బ్యాటింగ్లో శరత్వం సాధించే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరూ ఆటను చూడలేకపోతున్నాము అని అభిమానులు ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. 


విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులు బీసీసీఐని ఒక విన్నపాన్ని కోరడం జరిగింది భవిష్యత్తులో అయినా ఇలాంటి మ్యాచ్లకు సరైన ప్రసారం ఏర్పాటు చేయాలి అని అభిమానులు కోరుతున్నారు. మనవాళ్లు ఆడిన మ్యాచ్లను అందరూ ఆన్లైన్లో చూడాలి అని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటి సమయంలో శ్రీమంగానేది తప్పనిసరిగా ఉంటే అభిమానులు ఇంకా ఆనందం నెలకొంటుంది. కానీ విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటోగాలాటను చూడలేకపోవడం అభిమానులను ఎంతటి బాధ కలిగిస్తుందో ఈ సంఘటనను చూస్తే మనకి అర్థమవుతుంది. ఏదైనాప్పటికిని మన చేతుల్లో లేని విషయాన్ని గురించి బాధ పెట్టము కంటే వాళ్ళిద్దరూ మంచిగా ఆడే విదేశీ ఆటలో కప్పు ఎత్తాలి అని మనందరం అభిమానులందరూ కోరుకోవాలి. ఫోర్త్ లైన్ న్యూస్. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.