జెమీమా, షెఫాలీ బ్రాండ్ వాల్యూ పెరిగింది.. కోట్ల రేంజ్‌లోకి .......
ODI వరల్డ్ కప్ గెలుపు తర్వాత జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మా బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగింది. కార్పొరేట్ సంస్థలు కోట్ల రేంజ్ డీల్స్‌కి సిద్ధంగా ఉన్నాయని సమాచారం.
భారత మహిళల జట్టు ODI వరల్డ్ కప్ విజయం క్రీడా ప్రపంచానికే కాకుండా కమర్షియల్ రంగానికీ సరికొత్త చైతన్యం తెచ్చింది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్లు జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మాల బ్రాండ్ విలువ గణనీయంగా పెరిగినట్లు కార్పొరేట్ వర్గాలు వెల్లడించాయి.
సమాచారం ప్రకారం, జెమీమా బ్రాండ్ విలువ ₹60 లక్షల నుంచి నేరుగా ₹1.5 కోట్ల దాకా చేరగా, షెఫాలీ ₹40 లక్షల నుంచి ₹1 కోటి స్థాయికి చేరినట్లు చెబుతున్నారు. ఇదే ధోరణి కొనసాగితే, మిగతా ఆటగాళ్లకూ 25-55 శాతం వరకూ వృద్ధి నమోదవుతుందని అంచనా.
లైఫ్‌స్టైల్, బ్యూటీ, పర్సనల్ కేర్, విద్యా సంస్థలు, ఆటోమొబైల్, బ్యాంకింగ్ వంటి రంగాలు ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లను తమ బ్రాండ్ ప్రచారకర్తలుగా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని సమాచారం.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0