9 కోట్లు పెట్టి కొంటే.. ఇప్పుడు ఐపీఎల్‌కు నో ఛాన్స్? బంగ్లా ప్లేయర్లపై బీసీసీఐ సంచలన ప్రకటన!

బంగ్లాదేశ్ క్రికెటర్లను ఐపీఎల్ నుండి నిషేధించాలనే డిమాండ్లపై బీసీసీఐ స్పందించింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఎంపికపై వస్తున్న వార్తల వెనుక అసలు నిజానిజాలు ఇక్కడ తెలుసుకోండి.

flnfln
Jan 2, 2026 - 16:09
 0  3
9 కోట్లు పెట్టి కొంటే.. ఇప్పుడు ఐపీఎల్‌కు నో ఛాన్స్? బంగ్లా ప్లేయర్లపై బీసీసీఐ సంచలన ప్రకటన!

1. ఐపీఎల్ ప్రారంభం కానున్న సమయంలో సోషల్ మీడియాలో రచ్చ. 
2. బంగ్లాదేశ్ ప్లేయర్లను ఆడియద్దు అంటూ.... 
3. BCCI ఏం చెప్పింది అంటే 
4. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది?
5. పూర్తి వివరాలు తెలియాలి అంటే కింద ఉన్న సమాచారానంతటిని చదవండి. 

 ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; త్వరలోనే IPL ప్రారంభం కానుంది అని మనందరికీ తెలిసిన విషయమే అయితే ఐపీఎల్ లో భారత ప్లేయర్లతోపాటు ఇతర దేశాల ప్లేయర్లు కూడా ఈ ఐపీఎల్ ఆడతారు అనే సంగతి మన అందరికి తెలిసిందే అయితే బంగ్లాదేశ్ దేశానికి చెందిన ముస్తాఫిజుర్ IPL లో  ఈ సీజన్ ఆడుతాడో లేదో అని ఐపీఎల్ అభిమానులు అనుకుంటూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా అనుకుంటున్నారు అంటే బంగ్లాదేశ్ లో ఇటీవలే హిందువులపై జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ ప్లేయర్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతూ ఉంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ ముస్తాఫిజుర్ ఐపీఎల్ లో ఆడించకూడదు కొన్ని వర్గాల నుండి వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ టాపిక్ అనేది అటు ఐపీఎల్ లోను రాజకీయ వర్గాలలోను హాట్ టాపిక్ గా మారింది. 


అయితే ఈ అంశంపై స్పందించిన BCCI  తెలిపింది ఏంటి అంటే ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ప్లేయర్లను తప్పించాలి అని కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి అధికారిక ఆదేశాలు రాలేదు అని స్పష్టం చేశాయి. ఐపీఎల్ అనేది ప్రొఫెషనల్ లీగ్, ఇందులో ఆటగాళ్లు ఎంపిక, పాల్గొండము అన్ని ఒప్పందాల, వీసా అనుమతులు , ICC నిబంధనలు ప్రకారమే జరుగుతాయి అని BCCI వర్గాలు జాతీయ మీడియాకు ద్వారా తెలియపరచడం జరిగింది. 


అయితే మరో కోణంలో అయితే ముస్తాఫిజుర్ సంబంధించిన అంశాన్ని రాజకీయ కోణంలోనికి తీసుకువెళ్లకూడదు అని కొందరు సీనియర్ ఆటగాళ్లు, క్రీడ విశేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఒక దేశంలో జరుగుతున్న గొడవలు బట్టి వ్యక్తిగతంగా ఆటగాళ్లను బాధ్యులను చేయడం సరికాదు అని వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. క్రీడలను క్రీడలు గానే చూడాలని రాజకీయాలకు దూరంగా ఉంచాలి అని ఆదేశిస్తున్నారు. 

అదే సమయంలో సోషల్ మీడియాలో కొందరు హిందువుల సంఘాలు కూడా ఐపీఎల్ ఫ్రాన్సిలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రచారం కూడా మరోవైపు జరుగుతూ ఉంది. బంగ్లాదేశ్ ప్లేయర్లను పక్కన పెట్టాలి అంటూ డిమాండ్లు చేస్తూ ఉన్నారు. అది డిమాండ్లపై ఐపీఎల్ టీమ్ ఫ్రాంచీలు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. 

మొత్తంగా చూస్తే బంగ్లాదేశ్ ప్లేయర్లు ఆడతారో లేదో అని ipl స్టార్ట్ అయ్యే సమయానికి తెలిసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో ఆరు నిర్ణయాలను బట్టి బంగ్లాదేశ్ ప్లేయర్లు ఆడుతారు అంటూ క్రికెట్, రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. 
*మరి మీరు చెప్పండి ఆ దేశంలో జరిగే అల్డర్లు బట్టి ఈ దేశంలో జరిగే ఐపీఎల్ క్రికెట్లో వాళ్లని అడిగాలా వద్దా? 
*మీ అభిప్రాయాన్ని కచ్చితంగా తెలియజేయండి. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.