సెమీస్ కోసం భారత్‌కు తప్పనిసరి విజయం!
వరల్డ్ వుమెన్స్ కప్‌లో భారత్ సెమీస్ ఆశలు సస్పెన్స్‌లో ఉన్నాయి. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌పై గెలిస్తే భారత్ సెమీస్ చేరుతుంది. కివీస్ ఓడితేనే అవకాశం పక్కాగా ఉంటుంది.
వరల్డ్ వుమెన్స్ కప్‌లో భారత్ సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పుడు బ్లూ బృందం ముందున్న రెండు కీలక పోటీలు—న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిస్తే నేరుగా సెమీస్‌కు దూసుకెళ్తుంది.
అయితే, న్యూజిలాండ్‌పై ఓడిపోతే BANపై తప్పనిసరిగా విజయం సాధించాల్సిందే. అదే సమయంలో కివీస్ తమ తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతే మాత్రమే భారత్‌కు సెమీస్ దారి తెరుచుకుంటుంది.
ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ చెరో 4 పాయింట్లతో సెమీస్ చివరి బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాయి
.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0