భారత్ ఓటమి.. సిరీస్ ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో టీమ్ ఇండియా 0–2 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. మూడో వన్డే అక్టోబర్ 25న సిడ్నీలో జరగనుంది.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు నిరాశపరిచింది. ఆసీస్ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఓటమితో భారత్ ఇప్పటికే 0–2 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రోహిత్, గిల్‌ల ఇన్నింగ్స్ ఆశాజనకంగా మొదలైందిగానీ, మధ్యలో వికెట్లు కోల్పోయి పెద్ద స్కోరుకి చేరుకోలేకపోయారు. అనంతరం 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు షార్ట్ (74), కాన్లీ (61), ఒవెన్ (36) అద్భుత బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని చేరుకుంది.
భారత్ బౌలర్లలో హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీసి ప్రయత్నించినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.
తదుపరి (మూడో) వన్డే ఈ నెల 25న సిడ్నీలో జరగనుంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0