IND vs SA తొలి టెస్ట్: మొదటి రోజే భారత్ దుమ్మురేపింది—SA 159కి కుప్పకూలింది
IND vs SA తొలి టెస్టులో తొలి రోజే భారత్ ఆధిపత్యం చాటింది. సౌత్ ఆఫ్రికా 159కి ఆలౌట్. బుమ్రా 5 వికెట్లు. భారత్ 1 వికెట్ నష్టానికి 37 పరుగులు చేసి స్ట్రాంగ్ స్టార్ట్ ఇచ్చింది.
ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న భారత్–దక్షిణాఫ్రికా తొలి టెస్టులో టీమ్ ఇండియా శక్తివంతమైన ఆరంభం చేసింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 159 పరుగులకే అలౌట్ అయింది.
బుమ్రా తన అద్భుత బౌలింగ్‌తో ఐదు వికెట్లు పడగొట్టి SA బ్యాటింగ్‌ను చిత్తు చేశాడు. సిరాజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
బ్యాటింగ్‌లోకి దిగిన భారత జట్టులో జైస్వాల్ (12) త్వరగానే పెవిలియన్ చేరినా, KL రాహుల్ (13), వాషింగ్టన్ సుందర్ (6) క్రీజులో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.
తొలి రోజు ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 37 పరుగులు చేసి దూకుడు చూపించింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0