ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మరో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ సాధించని అద్భుత రికార్డును ఇండోనేషియా పేసర్ గేడే ప్రియాందన తన ఖాతాలో వేసుకున్నారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్లో 5 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా ఆయన నిలిచారు. కాంబోడియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ అసాధారణ ఫీట్ సాధించి ప్రపంచ క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించారు.
ఈ మ్యాచ్‌లో ఇండోనేషియా బౌలింగ్ విభాగం పూర్తిగా ఆధిపత్యం చూపించింది. ముఖ్యంగా గేడే ప్రియాందన వేసిన ఆ ఓవర్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లు ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుసగా ఐదు వికెట్లు పడగొట్టడం ద్వారా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. ఒకే ఓవర్లో ఐదు వికెట్లు అంటే కేవలం నైపుణ్యమే కాదు, అద్భుతమైన లైన్, లెంగ్త్, స్వింగ్, అలాగే మానసిక స్థైర్యానికి నిదర్శనం.
ఇంతకుముందు అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఘనతను పలువురు స్టార్ బౌలర్లు సాధించారు. శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగా, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్, ఐర్లాండ్ ఆల్‌రౌండర్ కర్టిస్ కాంఫర్, వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఈ జాబితాలో ఉన్నారు. అయితే వారందరికీ మించి ఒక అడుగు ముందుకు వేసి, ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా ప్రియాందన చరిత్ర సృష్టించారు.
డొమెస్టిక్ క్రికెట్ విషయానికి వస్తే, ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీసిన అరుదైన రికార్డు ఇప్పటికే ఉంది. బంగ్లాదేశ్ బౌలర్ అల్ అమీన్ హొసైన్, భారతదేశానికి చెందిన అభిమన్యు మిథున్ ఈ ఘనతను డొమెస్టిక్ టోర్నమెంట్లలో సాధించారు. ముఖ్యంగా అభిమన్యు మిథున్ 2019 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్లు తీసి అప్పట్లో సంచలనం సృష్టించారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ఫీట్ సాధించడం మరింత గొప్ప విషయం.
గేడే ప్రియాందన ఇది ప్రదర్శన ఇండోనేషియా క్రికెట్కు ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఇండోనేషియా అసోసియేట్ దేశంగా గుర్తింపు పొందింది ఇప్పుడు తాజాగా ప్రపంచ క్రికెట్ మ్యాచ్లో క్రమంగా తన స్థానాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఇలాంటి రికార్డులు ఆ దేశాలు ఆటగాళ్లకు ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడము కాకుండా ఆదేశంలో క్రికెట్ మరింత అభివృద్ధి పొందే అవకాశం ఉన్నాయి.
ఒకే ఓవర్లలో గేడే ప్రియాందన వివిధ రకాల డెలివరీలను సింపుల్ గా ఉపయోగించారు. కొన్నిటిని అయితే స్వింగ్ రూపం లో వేయడం జరిగింది మరికొన్ని పేస్ లో మార్పు చూపించి పాటర్లను తప్పుదోవ పట్టించగలిగాడు. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా ఎక్కడ తన యొక్క ఏకాగ్రత కోల్పోకుండా వరుసగా వికెట్లు పడగొట్టడం ఆయనకున్న విశ్వాసం ఎంత గొప్పదో ఇక్కడ అర్థమవుతుంది.
గేడే ప్రియాందన సాధించిన ఈ ప్రపంచ రికార్డును టి20 క్రికెట్ చరిత్రలో ఎప్పటికిని గుర్తింపు పోతుంది అని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. భవిష్యత్తులో మరెవరైనా ఈ రికార్డులను బద్దలు కొట్టగలరా కొట్టలేరా అనేది చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఒకే ఓవర్లలో ఐదు వికెట్లు తీసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే అరుదైన రికార్డు తన పేరుపైన రాసుకోవడం జరిగింది. ఒక్క ఓవర్లలో ఐదు వికెట్లు తీయటం మీకు గాని మీ యొక్క టీం లో గాని ఎవరికైనా అవుతదా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా ప్రపంచ క్రికెట్ గురించి ప్లేయర్స్ గురించి అన్ని విషయాలు మీరు చదవచ్చు.