ఛత్తీస్గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం – 6మంది మృతి, 25మంది తీవ్ర గాయాలు
ఛత్తీస్గఢ్‌లోని జైరామ్‌నగర్ స్టేషన్ వద్ద కోర్బా ప్యాసింజర్ రైలు–గూడ్స్ రైలు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. 6మంది మృతి, 25మంది తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జైరామ్‌నగర్ స్టేషన్ సమీపంలో భయానక రైలు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కోర్బా ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలును ఢీకొట్టడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు కొంత భాగం గూడ్స్ రైలు మీదకు ఎక్కిపోయింది.
ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద స్థలానికి అధికారులు, రైల్వే సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది
.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0