BCCI రోహిత్ విరాట్ కోహ్లీ జీతాలు తగ్గిస్తుంది కారణాలు?
BCCI కొత్త కాంట్రాక్ట్ పాలసీ కింద కోహ్లి, రోహిత్ శర్మను A+ గ్రేడ్ నుంచి A గ్రేడ్‌కు మార్చే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్‌ను A నుండి A+కి ప్రమోట్ చేసే ప్రతిపాదనతో పాటు అంపైర్లు–రిఫరీల వేతనాలపై కూడా చర్చించనున్న బోర్డు.
* రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జీతాలు తగ్గుతాయా
* BCCI నిజముగా నిర్ణయం తీసుకుంటుందా ?
* ఇద్దరినీ A + నుంచి A కేటగిరికి మారుస్తారా ?
* వీరి జీతాలు కూడా తగ్గుముఖం పడతాయా
*ఇద్దరి అభిమానులకు కొంత ఆందోళనలో ఉన్నారు
* సుమంగిల్ A క్యాటగిరి నుంచి A+ క్యాటగిరికి వెళ్తున్నాడు.
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ భారత క్రికెట్‌కు ఎంతోకాలంగా ప్రధాన స్తంభాల్లా నిలిచారు. అయితే ప్రస్తుతం వన్‌డే ఫార్మాట్‌కే పరిమితమైన వీరి స్థితిగతులను BCCI కొత్త కాంట్రాక్ట్ పాలసీలో పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫార్మాట్ల ఆధారంగా కాంట్రాక్ట్ గ్రేడింగ్‌ను సమీక్షించాలనే బోర్డు నిర్ణయం ఈ మార్పులకు మూలమైనట్టు చెబుతున్నారు.
ఇండియన్ టీం భవిష్యత్ ప్రణాళికలో యువ ఆటగాళ్లను మరింతగా ప్రమోట్ చేయాలనే ఆలోచన బోర్డులో బలపడుతోంది. ముఖ్యంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇటీవల అన్ని ఫార్మాట్లలోనూ స్థిరమైన ప్రదర్శన ఇస్తుండటంతో, అతన్ని A+ కేటగిరీలో చేర్చడంపై సీనియర్లు, సెలెక్టర్లు, మేనేజ్‌మెంట్ సానుకూలంగా ఉన్నారు.
అదే సమయంలో రోహిత్—కోహ్లిల వన్‌డేలకు మాత్రమే ఆడటం, T20I నుంచి తప్పుకోవడం, టెస్ట్‌లలో పాల్గొనడంలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వారిని A+ నుంచి Aకు మార్చాలనే ప్రతిపాదన బోర్డు సమావేశంలో చర్చకురానుంది. ఈ మార్పులతో వార్షికంగా సుమారు ₹2 కోట్లు వరకు వారి కాంట్రాక్ట్ జీతం తగ్గే అవకాశం ఉంది.
అదే సమావేశంలో అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ఫీజుల పెంపుపై కూడా చర్చ జరుగనుంది. దేశీయ క్రికెట్‌లో అంపైర్లు చేస్తున్న కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి మెరుగైన వేతనం ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ వస్తోంది. దీన్ని బోర్డు ఈసారి సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంటుందని తెలుస్తోంది.
ప్రస్తుతం BCCI కాంట్రాక్ట్ గ్రేడింగ్ వ్యవస్థ ఇలా ఉంది:
A+ గ్రేడ్: ₹7 కోట్ల వార్షిక వేతనం
A గ్రేడ్: ₹5 కోట్లు
B గ్రేడ్: ₹3 కోట్లు
C గ్రేడ్: ₹1 కోటి
ఈ గ్రేడింగ్ మార్పులు ఫ్యాన్స్, క్రికెట్ విశ్లేషకుల మధ్య పెద్ద చర్చనీయాంశమవుతున్నాయి. కొంతమంది రోహిత్–కోహ్లిలకు ఇది న్యాయం కాదని అనుకుంటుండగా, మరికొందరు ప్రస్తుత టీమ్ స్ట్రాటజీ, ఫార్మాట్ పాల్గొనటం చూసుకుంటే ఈ నిర్ణయం సహజమేనని అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి, ఈనెల 22న జరిగే బోర్డు వార్షిక కౌన్సిల్ మీటింగ్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కొత్త కాంట్రాక్ట్‌లు విడుదలైన తర్వాత టీమ్‌లో శక్తి సమసమానంగా విభజించబడుతుందని అంచనా. మరి ఇది కొంత మేరకు రోహిత్ విరాట్ అభిమానులకు నిరోత్సాహం కలిగించవచ్చు అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. అలాగే టీమ్ ఇండియాలో ఎవరి బ్యాటింగ్ ! ఎవరి బౌలింగ్ మీకు ఇష్టము మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
రచయిత : ఫోర్త్ లైన్ న్యూస్ ట్రిండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వం పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనలకు సంబంధించిన కథనాలు, పొలిటికల్, స్పోర్ట్స్ కి సంబంధించిన అన్నిటిని అందిస్తాము
ఫోర్త్ లైన్ న్యూస్ : ద్వారా మీరు గ్రామ వార్తలు, మండల వార్తలు, జిల్లా వార్తలు, రాష్ట్రం వార్తలు, దేశ వార్తలు, ప్రపంచ దేశాల్లో జరిగే వార్తలు అన్నీ మీరు ఇక్కడ చదవచ్చు. ఢిల్లీ నుంచి గల్లీలో జరిగే ప్రతి సంఘటనను కూడా మా న్యూస్ వెబ్సైట్ మీకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వార్త మా వెబ్సైట్లో దొరుకుతుంది కాబట్టి మా వెబ్సైట్లో మీరు సెర్చింగ్ చేయొచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0