వరల్డ్ కప్ విజేతలకు విక్టరీ పరేడ్ లేదు – భద్రతా కారణాలతో BCCI నిర్ణయం
ICC ఉమెన్స్ వరల్డ్ కప్ విజేత టీమ్ ఇండియా విక్టరీ పరేడ్ రద్దు. భద్రతా కారణాలతో పరేడ్ చేపట్టడం లేదని BCCI ప్రకటించింది. రేపు ఢిల్లీలో ప్రధాని చేతుల మీదుగా సన్మానం.
ICC ఉమెన్స్ వరల్డ్ కప్–2025ను కైవసం చేసుకున్న భారత మహిళా జట్టు విక్టరీ పరేడ్‌కు దూరం కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
ఇటీవల జరిగిన IPL కప్ విజేత RCB విక్టరీ పరేడ్లో తొక్కిసలాట జరిగి అభిమానులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఇంకా గుర్తుండగానే, భద్రతా కారణాలతో ఈసారి మహిళా టీమ్ పరేడ్‌ను రద్దు చేయాలని బోర్డు నిర్ణయించింది.
అయితే, రేపు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా టీమ్ ఇండియాకు సన్మానం జరగనుంది. దేశానికి తొలి మహిళా వరల్డ్ కప్ అందించినా, జాతీయ స్థాయి ర్యాలీ లేకపోవడంపై అభిమానులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0