అల్లు అర్జున్ – అట్లీ సినిమా.. రూ.1000 కోట్ల బడ్జెట్.. రూ.600 కోట్ల OTT డీల్ టాక్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ news ఇదే. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ రూ. 600 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. భారతీయ సినీ చరిత్రలో ఇది సరికొత్త రికార్డు.

flnfln
Dec 29, 2025 - 12:27
Dec 29, 2025 - 19:36
 0  4
అల్లు అర్జున్ – అట్లీ సినిమా.. రూ.1000 కోట్ల బడ్జెట్.. రూ.600 కోట్ల OTT డీల్ టాక్!

1. అల్లు అర్జున్ కొత్త సినిమా అప్డేట్ 
2. 1000 కోట్ల బడ్జెట్ తో సినిమా 
3. అల్లు అర్జున్ కొత్త లుక్ ఎలా ఉంటుంది ? 
4. రిలీజ్ కాకముందే ఓటిపి ప్లాట్ఫామ్ డీల్ 
5. 600 కోట్లు OTT డీల్ ? 
6. పూర్తి వివరాలు తెలియలే అంటే కింద ఉన్న సమాచారాన్ని చదవండి.

 ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన వార్త ఇదే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం విడుదలకు ముందే సెన్సేషన్లు సృష్టిస్తోంది. దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ రేంజ్‌కు చేరుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన తాజా వార్త ఏమిటంటే, ప్రముఖ అంతర్జాతీయ OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రూ.600 కోట్లకు దక్కించుకునేందుకు చర్చలు జరుపుతోందన్న టాక్. ఈ డీల్ కనుక ఫైనల్ అయితే, భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక OTT డీల్‌గా ఇది నిలిచే అవకాశముంది. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకు కూడా ఈ స్థాయిలో డిజిటల్ రైట్స్ ధర పలకలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అల్లు అర్జున్‌కు ‘పుష్ప’ సినిమాతో వచ్చిన గ్లోబల్ ఫ్యాన్‌బేస్ ఈ డీల్‌కు ప్రధాన కారణంగా చెబుతున్నారు. పుష్ప సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యి అంతర్జాతీయంగా అద్భుతమైన వ్యూయర్‌షిప్‌ను సాధించింది. ముఖ్యంగా నార్త్ ఇండియా, దక్షిణ అమెరికా, జపాన్ వంటి దేశాల్లో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో అతను నటిస్తున్న కొత్త సినిమా డిజిటల్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడటం సహజమే.

మరోవైపు డైరెక్టర్ అట్లీ కూడా ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన బలం. ‘రాజా రాణి’, ‘తెరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’, ‘జవాన్’ వంటి భారీ విజయాలతో అట్లీ ప్రస్తుతం ఇండియాలో టాప్ కమర్షియల్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్‌తో చేసిన ‘జవాన్’ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో అట్లీ బ్రాండ్ మరింత పెరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్‌తో అతను తెరకెక్కిస్తున్న సినిమా అంటే ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ చిత్రం ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా రూపొందించబడుతుంది. సమాజంలో జరిగే అంశాలతో పాటు బలమైన ఎమోషన్ తో చిత్రము  రూపొందిస్తున్నారు అని సమాచారం. ఈ చిత్రం కోసం భారీ సెట్లు , అంతర్జాతీయ సాయి VFX , హాలీవుడ్ టెక్నీషియన్స్ భాగ్యస్వాములతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారము వస్తుంది. అల్లు అర్జున్ ఇప్పటివరకు ఎవరో చూడని విధంగా కొత్త లుక్ లో కనిపించబోతున్నారు అని అభిమానులు ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. 

 దాదాపుగా ఓటీపీ డిజిటల్ ఈ చిత్రం అన్ని భాషలలో 600 కోట్లు డీల్ వార్త నిజమైతే ఈ సినిమా నిర్మాతకు విడుదలకు ముందే భారీ లాభాలు కాయం అవుతాయి. సినిమా రిలీజ్ కాకముందే ఇంత పెద్ద డీల్ ఓకే అయితే సినిమా మాక్సిమం సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టే ని వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే  థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ కూడా భారీ ధరలకు అమ్ముడయ్యే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 

ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే ఓటీపీ డీల్ కుదిరింది అని ఎలాంటి సమాచారం లేదు. ఇది కేవలం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాకు మాత్రమే, ఫైనల్ అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సి ఉంది. ఎంతైనా గాని అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సినిమా భారతీయ సినిమా మార్కెట్టును కొత్త స్థాయిలోనికి తీసుకువెళ్లబోతుంది అని అయితే అందరికీ అర్థమవుతుంది.  ఫోర్త్ లైన్ న్యూస్ కథనం 

*పుష్ప 1, 2 అల్లు అర్జున్ కెరీయర్ని మార్చేసింది.  
*అల్లు అర్జున్ సినిమాలో మీకు ఏ సినిమా అంటే ఇష్టము 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.