తెలుగు టైటాన్స్ వైజాగ్‌లో హ్యాట్రిక్ విజయంతో మెరిసింది
కబడ్డీ లీగ్ సీజన్-12లో తెలుగు టైటాన్స్ వరుసగా మూడో విజయం సాధించింది. వైజాగ్ వేదికగా యు ముంబాపై 45-37 తేడాతో గెలిచి హోం లెగ్‌ను విజయోత్సాహంగా ముగించింది.
వరుస హ్యాట్రిక్ లతో దూసుకుపోతున్న తెలుగు టైటాన్స్
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-12లో తెలుగు టైటాన్స్ వరుసగా మూడో విజయంతో సత్తా చాటింది. హోం గ్రౌండ్లో ఐదు మ్యాచ్‌లు 9 ఆడిన తెలుగు టైటాన్స్ తొలి రెండు మ్యాచ్‌లలో ఓడినా... ఇప్పుడు 'హ్యాట్రిక్' విజయంతో వైజాగ్ అంచెను ముగించింది. బుధవారం జరిగిన పోరులో టైటాన్స్ 45-37 స్కోరుతో యు ముంబాను చిత్తు చేసింది. టైటాన్స్ తరపున భరత్ హుడా 13 పాయింట్లతో చెలరేగగా... చేతన్ సాహు 6, కెప్టెన్ విజయ్ మలిక్ 5 పాయింట్లతో అతనికి సహకరించారు. చివరి 10 నిమిషాల్లో కాస్త పోరాడిన ముంబా ప్రత్యర్థిని 'ఆలౌట్' చేయగలిగినా పాయింట్ల అంతరం మాత్రమే తగ్గించ గలిగింది. ముంబా ఆటగాళ్లలో సందీప్, ఆమిర్ మొహమ్మద్ చెరో 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో పుణేరీ పల్టన్ 43-32 తేడాతో యూపీ యోధాన్పై గెలిచిది. నేడు జరిగే + మ్యాచ్‌లలో యు ముంబాతో పట్నా పైరేట్స్, దబంగ్ ఢిల్లీతో గుజరాత్ జెయింట్స్ తలపడతాయి. తొలి 28 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన విశాఖపట్నం లో నేటితో పీకేఎల్ పోటీలు ముగియనున్నాయి. రేపటి నుంచి జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా టోర్నీ కొనసాగుతుంది
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0