నవీ ముంబైలో వర్షం అంతరాయం – భారత్ పెద్ద స్కోరుతో దూసుకెళ్తున్నా మ్యాచ్ ఆగిపోయింది
మహిళల ప్రపంచకప్‌లో భారత్–న్యూజిలాండ్ మ్యాచ్‌కు నవీ ముంబైలో వర్షం అంతరాయం కలిగించింది. ప్రతీకా రావల్, స్మృతి మందనా సెంచరీలతో భారత్ 329/2 పరుగులు చేసింది.
నవీ ముంబై: మహిళల ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. 48 ఓవర్ల వరకు భారత్ 329/2 స్కోరుతో చెలరేగి ఆడుతుండగా ఒక్కసారిగా కుండపోత వర్షం మొదలైంది. వెంటనే ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లగా, గ్రౌండ్ స్టాఫ్ మైదానాన్ని కవర్లతో కప్పేశారు. ప్రస్తుతం జెమిమా రోడ్రిగ్స్ 69, హర్మన్‌ప్రీత్ కౌర్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇక అంతకుముందు ప్రతీకా రావల్ (122), స్మృతి మందనా (109) సెంచరీలతో అదరగొట్టారు. ఇద్దరూ కలిసి మొదటి వికెట్‌కి భారీ భాగస్వామ్యం కట్టారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0