ధోని : పెళ్లి వేడుకలో ధోని చేసిన ఫన్నీ కామెంట్స్ వైరల్… విరాట్‌తో డిన్నర్ కూడా హాట్ టాపిక్!

పెళ్లి వేడుకలో ధోని చేసిన ఫన్నీ కామెంట్స్, జోక్స్ సోషల్ మీడియాలో వైరల్. వధూవరులకు ఇచ్చిన సలహాలు, మగవాళ్లపై చేసిన సరదా వ్యాఖ్యలు హాట్ టాపిక్. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ ధోని ఇంట్లో డిన్నర్‌కి వెళ్లడం కూడా నెటిజన్లలో చర్చగా మారింది.

flnfln
Nov 29, 2025 - 10:30
Nov 29, 2025 - 10:33
 0  3
ధోని : పెళ్లి వేడుకలో ధోని చేసిన ఫన్నీ కామెంట్స్ వైరల్… విరాట్‌తో డిన్నర్ కూడా హాట్ టాపిక్!

* ధోని చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి 

* ఒక పెళ్లిలో కామెంట్స్ చేశారు ఎంఎస్ ధోని

* భర్తలoదరూ అదే మార్గంలో ఉన్నారు 

* భార్యలకు కూడా ప్రత్యేక ఒక సలహా ఇచ్చిన ధోని 

* ధోని ఇంటికి విందు కోసం వెళ్లిన కింగ్ విరాట్ 

* పూర్తి వివరాలకు వెళితే 

fourth line news : ఎంఎస్ ధోని మనందరికీ పరిచయం లేని పేరు. మన టీమ్ ఇండియాకి వరల్డ్ కప్ సాధించిన హీరో. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నువ్వులు అక్కడ ఆనందాలు, అది మనందరికీ తెలిసిన విషయమే. ఎంఎస్ ధోని తాజాగా ఓ పెళ్లి వేడుకల్లో ఆయన మాటలాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. పెళ్లి చేసుకుంటున్న నవ్వ దంపతుల పక్కన ఉండి పెళ్లి జీవితంపై కొన్ని ఆసక్తికరమైన సలహాలు ఇచ్చారు. 

పెళ్లి కుమారుని ఉద్దేశిస్తూ, పెళ్లి చేసుకోవడం చాలా మంచి విషయం. కానీ నువ్వు చాలా తొందర పడ్డావు. కొంతమందికి నిప్పులతో చెలగాటం ఆడటం చాలా ఇష్టంగా ఉంటుంది. ఉత్కర్ష్ (వరుడు) కూడా అలాంటి వాడే" అని ధోనీ అన్నారు. దాంతో అక్కడున్న వారంతా నువ్వేశారు. అలాగే పెళ్లయిన మగవాళ్ళందరిని ఉద్దేశిస్తూ. నా భార్య వేరు అని మాత్రం అసలు అనుకోవద్దు. ఇక్కడున్న మగ జాతి వాళ్ళందరి పరిస్థితి ఒకటే. మనం వరల్డ్ కప్ గెలిచామా లేదా అన్నదానితో సంబంధం లేదు అంటూ సరదాగా చమత్కరించాడు. ధోని మాటలు చాలా సరదాగా ఉంటాయి.

ఇక పెళ్లి కూతురికి సలహా ఇస్తా, బతుకు కోపం వస్తే ఏమీ మాట్లాడకండి. ఒక పది నిమిషాలు అయితే వాళ్లే చల్లబడతారు. " మా బలం మీకు తెలుసు " అని చెప్పి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక విషయానికి వస్తే ఈ వీడియో పాతదా లేదా కొత్తగా అనే దానిపైన వివరణ లేదు. ప్రెసెంట్ అయితే సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారుతుంది. ఈ వీడియో పైన అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

దక్షిణాఫ్రికా తో వన్డే సిరీస్ కోసం విరాట్ కోహ్లీ ఇండియాకు వచ్చాడు. ఇండియాకి వచ్చిన వెంటనే ధోని నివాసానికి వెళ్లి కలిశారు. ఈ డిన్నర్ విందులో రిషబ్ పంత్ కూడా పాల్గొన్నట్టు సమాచారం. ప్రెసెంట్ అయితే ధోని స్వయంగా కోహ్లీని కారులో డ్రైవ్ కి తీసుకు వెళ్లిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కూల్ వర్సెస్ ఫైర్ పక్కపక్క ఉండటం ఇద్దరు అభిమానుల్ని ఎంతో ఆనందపరిచాయి. 

* ధోని అంటే ఎంతమందికి ఇష్టము 

* ఇంకా ధోని ఎన్ని సంవత్సరాలు ఐపీఎల్ ఆడుతాడో !గెస్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపండి 

* అలాగే కింగ్ విరాట్ కోహ్లీ గురించి కూడా మీ అభిప్రాయాన్ని తెలుపండి. 

* fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.