వన్డే భవిష్యత్తు కోసం రోహిత్–కోహ్లీపై బీసీసీఐ కీలక చర్చలు: ప్రపంచకప్ దృష్టిలో వ్యూహాలు సిద్ధం
బీసీసీఐ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే భవిష్యత్తుపై కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రపంచ కప్ దృష్ట్యా వారి పాత్ర, వ్యూహాలపై చర్చలు జరగనున్నాయి. తాజా సిరీస్‌లలో వారి ప్రదర్శన, విజయ్ హజారే ట్రోఫీలో ఆడే అవకాశాలపై పూర్తి వివరాలు.
* రోహిత్ కోహ్లీ భవిష్యత్తులపై బీసీసీ కీలక సమావేశం
* ప్రపంచ కప్ లక్ష్యంగా చర్చలు జరుపనున్న సెలెక్టర్లు
* బోర్డు వారి ఆటలకు స్పందించబోతుంది
* రోహిత్ కోహ్లీకి విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని
* పూర్తి వివరాల్లోకి వెళితే
BCCI కోహ్లీ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై దృష్టి పెట్టింది. ప్రపంచ కప్ ఆధారంగా ఈ ఇద్దరే విషయాల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చించేందుకు సెలెక్టర్లు, జట్టు యాజమాన్యంతో ఒక కీలకమైన సమావేశం జరగబోతుంది అని తెలుస్తుంది. దక్షిణాఫ్రికా తో విశాఖపట్నంలో మూడే వన్డే ముగిసిన తర్వాత భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఈ భేటీ అహ్మదాబాద్‌లో జరగనున్నట్టు తెలుస్తుంది. ఈ భేటీలో కీలకంగా BCCI ఉన్నత అధికారులు, కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ గవాస్కర్ ఇందులో పాల్గొనడం జరుగుతుంది.
రోహిత్ కోహ్లీ వారి భవిష్యత్తుపై ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మేట్ లో మాత్రమే ఆడుతున్న వారి భవిష్యత్తు ప్రణాళికలపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదు అని స్పష్టమవుతుంది. సీనియర్ ఆటగాలుగా వారి పాత్ర ఏంటి యాజమాన్యం వారి నుంచి ఏమి ఆశిస్తుందనే దానిపై స్పష్టతనివ్వడం చాలా ముఖ్యం
ఆస్ట్రేలియాతో జరిగిన తాజా వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ 202 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. మరోవైపు, విరాట్ కోహ్లీ తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయినప్పటికీ, మూడో మ్యాచ్‌లో 74 పరుగులు చేసి రిథమ్ కనిపించాడు. అయితే, సిరీస్ మొదటి దశలో రోహిత్, కోహ్లీ ఇద్దరూ తడబడినట్లు కనిపించడంతో, ఇలాంటి స్థిరతలేమి ప్రతి సిరీస్‌లో చోటు చేసుకుంటే జట్టుకు సమస్యలు తలెత్తొచ్చని బీసీసీఐ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం పెద్దగా మ్యాచ్‌లు లేకపోవడంతో, మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వచ్చే నెల జరిగే విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ పాల్గొనాలని బీసీసీఐ సూచించనుంది. నిరంతర ఆటతీరు కొనసాగాలంటే డొమెస్టిక్ మ్యాచ్‌లు కీలకమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికా సిరీస్ తరువాత టీమిండియా జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. అనంతరం జులైలో ఇంగ్లండ్‌తో కీలక పర్యటన ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ బ్యాట్స్‌మన్‌లు ఫామ్‌ను పదిలం చేసుకోవాలని బోర్డు భావిస్తోంది.
* రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఏవిధంగా ఆడుతారో మనందరికీ తెలిసిన విషయమే.
* వాళ్లు ఈసారి ఆడే మన ఇండియాకి ప్రపంచ కప్ తీసుకురావాలి అని మనందరం కోరుకోవాలి.
* మీకు ఏ ప్లేరంటే ఎక్కువ ఇష్టం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0