డబ్బు ఇవ్వడం లేదు.. తప్పుడు ప్రచారంపై JD వాన్స్ ఫైర్ –
ఇరాన్‌కు అమెరికా ఎలాంటి డబ్బు ఇవ్వడం లేదని US ఉపాధ్యక్షుడు JD వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం, హార్ముజ్ రీఓపెన్, శాంతి ఒప్పందంపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్కు మేం డబ్బు ఇవ్వడం అనుకోవడం లేదు: JD వాన్స్
హార్ముజ్ రీఓపెన్, ఇరాన్ అణ్వాయుధ కార్య క్రమాన్ని ముగించేందుకు సంబంధించిన ఒప్పందంపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని US ఉపాధ్యక్షుడు JD వాన్స్ తీవ్రంగా మండిపడ్డారు. 'మేం ఇరాన్కు ఎలాంటి డబ్బు ఇవ్వడం లేదు. డీల్పై సైన్ చేసేందుకో, సమావేశానికి హాజరైనందుకో నిధులు రావు. ఇరాన్ తన బాధ్యతను నెరవేరిస్తే.. ఆ ఆర్థిక ప్రయోజనాలు వారికి, మొత్తం ప్రాంతానికి అందుతాయి. శాశ్వత శాంతికి దారితీసే డీల్ ఇది' అని చెప్పారు.
ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని ముగించే దిశగా ఒక స్పష్టమైన ఒప్పందం జరిగితే అది కేవలం రెండు దేశాలకు మాత్రమే కాకుండా మధ్యప్రాచ్య ప్రాంతం మొత్తం శాంతి, భద్రతలకు ఉపయోగపడుతుందని JD వాన్స్ తెలిపారు. శాశ్వత శాంతికి దారితీసే ఒప్పందం కావాలని అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు.
ఇప్పటికే అమెరికా-ఇరాన్ సంబంధాలు చాలా కాలంగా ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో శాంతి ఒప్పందంపై వస్తున్న వార్తలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే ప్రజలు విషయాలను అర్థం చేసుకోవాలని అమెరికా వర్గాలు సూచిస్తున్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0