రామ్ చరణ్ పాలిటిక్స్ ఎంట్రీపై క్లారిటీ.. సీఎం కావాలంటున్న ఫ్యాన్స్,
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాలిటిక్స్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. అభిమానులు తనను సీఎం గా చూడాలనుకోవడంపై స్పందిస్తూ 'పెద్ది' సినిమా ప్రమోషన్స్ లో చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
* రామ్ చరణ్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారా?
* CM చూడాలని అభిమానులు అనుకుంటున్నారు?
* నటనలోనే పెద్ద స్థాయిలో ఉండాలని రామ్ చరణ్
* జూన్ 4న పెద్ద సినిమా రిలీజ్
మెగాస్టార్ రామ్ చరణ్ తన రాజకీయ ప్రవేశంపై వస్తున్నా ఊహాగానాలకు క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోనికి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు, సినిమా రంగంలోనే అగ్రస్థానానికి చేరడమే లక్ష్యం ఉందని ఆయన తెలిపారు. తాజాగా పెద్ది ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఈ విధంగా అడిగారు: అభిమానులు మిమ్మల్ని సీఎం గా చూడాలనుకుంటున్నారు, మీరు రాజకీయాల్లోనికి వచ్చే అవకాశం ఉందా! అన్న ప్రశ్నకు రామ్ చరణ్ సమాధానం చెబుతూ, రెండు పడవలపై ప్రయాణం చేయాలనుకోవట్లేదు. నా పూర్తి దృష్టి మొత్తం నటన పైనే ఉంది. సినిమా రంగంలోనే గట్టిగా నిలబడాలని నా దృష్టి అంత అని సమాధానం ఇచ్చారు.
అలాగే పెద్ది సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇది తన కెరియర్లో ఎంతో నిజాయితీగా తీసిన చిత్రమని రామ్ చరణ్ వెల్లడించారు. పెద్ది సినిమా కోసం చాలా కృషి చేశాను, ఆ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డానని ఆయన చెప్పారు. క్రీడ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుచ్చిబాబు దర్శకత్వంలో వహిస్తున్న పెద్ది చిత్రం జూన్ 4న ఫ్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0