హోండురస్‌లో ఘోరమైన దాడులు: ఆరుగురు పోలీసులు, 19 మంది కార్మికులతో సహా 25 మందిని కాల్చి చంపిన దుండగులు

మధ్య అమెరికా దేశం హోండురస్‌లో ఘోర కలికాలం సాగింది. వేర్వేరు చోట్ల జరిగిన దారుణ దాడుల్లో ఆరుగురు పోలీసులు సహా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

May 22, 2026 - 08:12
 0  3
హోండురస్‌లో ఘోరమైన దాడులు:  ఆరుగురు పోలీసులు, 19 మంది కార్మికులతో సహా 25 మందిని కాల్చి చంపిన దుండగులు

* మధ్య అమెరికా దేశంలో దారుణం 

* రెండు ప్రాంతాల్లో దారుణమైన దాడులు 

* ఆరుగురు పోలీసులు, 25 మంది మృతి 

* పూర్తి వివరాల్లోనికి వెళ్తే 

 fourth line news : మధ్య అమెరికా దేశంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. హోండురస్‌లో వేరు వేరు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఆరుగురు పోలీసులు మరణించగా 25 మంది ప్రజలు మరణించినట్టు తెలుస్తుంది. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఉన్నతాధికారులు తెలిపిన ప్రగారమైతే, ఈ దాడులకి ముఖ్యమైన కారణాలు గ్యాంగ్‌ల కార్యకలాపాలు, భూవివాదాలతో ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయ ప్రతినిధి యూరీ మోరా ప్రకారం.. మొట్టమొదటి దాటి దేశ ఉత్తర ప్రాంతంలోని ట్రుజిల్లో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రంలో జరిగింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులపై దుండగులు కాల్పులు జరుపగా దాదాపుగా 19 మంది మరణించారు. అయితే, మృతుల బంధువులు తమ వారి మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి తీసుకువెళ్లడంతో ఎంతమంది మరణించారు అనేది అంచనా వేయలేకపోతున్నాము అని జాతీయ పోలీసు ప్రతినిధి ఎడ్గార్డో బరహోనా చెప్పినట్టు అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) పేర్కొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టడానికి ప్రత్యేకమైన బృందాలు పంపించారు. 

రెండువ ఘటన వచ్చేసి గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలోని కోర్టెస్ డిపార్ట్‌మెంట్‌లోని ఓమోవా మున్సిపాలిటీలో జరిగింది.రాజధాని టెగుసిగల్పా నుంచి గ్యాంగ్‌లకు వ్యతిరేకంగా ఒక మిషన్‌పై వెళ్తున్న పోలీసుల వాహనాలపై దుండగులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఒక సీనియర్ అధికార్యతో సహా ఆరుగురు పోలీసులు మరణించినట్టు సమాచారం. 

ఈ రెండు దాడుల పైన అక్కడి ప్రభుత్వం హోండురస్ తీవ్రంగా స్పందించింది. నేషనల్ పోలీసులను వెంటనే ఘటన స్థలానికి పంపించినట్టు భద్రతా మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఫోరెన్సిక్ నిపుణులు, ప్రాసిక్యూటర్లతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం అయ్యేవిధంగా చేస్తున్నాము అని అధికారులు వెల్లడించారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
bharath About Me I am an independent news blogger with a passion for staying on top of general news and current events. For me, this isn’t just a job; it’s a dedicated hobby focused on bringing clarity to the daily headlines. I believe in quality over speed—which is why I personally verify every piece of information before it hits this site. My goal is to provide you with news you can trust, delivered with an individual perspective. నా గురించి నేను ఒక స్వతంత్ర వార్తా బ్లాగర్‌ని. తాజా వార్తలు మరియు సామాజిక అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం నాకో ఇష్టం. ఇది నాకు కేవలం వృత్తి మాత్రమే కాదు, వార్తల్లోని నిజానిజాలను స్పష్టంగా అందించాలనే ఒక చిన్న ప్రయత్నం. నేను వేగం కంటే నాణ్యతకే ప్రాముఖ్యత ఇస్తాను—అందుకే ఏదైనా వార్తను పోస్ట్ చేసే ముందు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తాను. నమ్మకమైన సమాచారాన్ని ఒక వ్యక్తిగత కోణంలో మీకు అందించడమే నా లక్ష్యం.