తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు: ఈరోజు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఒక శుభవార్త. ఇవ్వాలా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మొన్నటిదాకేమో ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలు, ఈ వానలు ఎప్పుడొస్తాయో అని ఎదురు చూసేవారు. వారి ఎదురుచూపు ఈరోజు నెరవేరింది. దేశంలోనికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొచ్చే అవకాశం ఉన్నాయి అని IMD వెల్లడించింది.
ఇటు తెలంగాణలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ రాష్ట్రాలు వచ్చేసి : రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాలు దంచికొడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇటు ఆంధ్రాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పోలవరం, కాకినాడ, తూ.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రజలందరూ వానలు వస్తున్నాయని ఎంతో సంతోషిస్తున్నారు. ఎండలకి ఇటు మానవులతో పాటు ఎన్నో మూగజీవాలు కూడా మరణించాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0